ఆదిరెడ్డి నిజస్వరూపం బయటపెట్టిన రివ్యూవర్.. అన్ని ఎకరాల ఆస్తి అంటూ?

బిగ్ బాస్ షోలో సామాన్యుడిలా అడుగు పెట్టి ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్న కంటెస్టెంట్లలో ఆదిరెడ్డి ఒకరు.

ఆదిరెడ్డికి ఈ షో ఏ స్థాయిలో ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ షో తర్వాత ఆదిరెడ్డికి సినిమా ఆఫర్లు కూడా ఊహించని స్థాయిలో పెరిగాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ షోలో తాను సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తినని ఆదిరెడ్డి ప్రచారం చేస్తుకున్నారు.

అయితే ఒక బిగ్ బాస్ రివ్యూవర్ మాత్రం ఆదిరెడ్డికి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు ఆదిరెడ్డికి 40 ఎకరాల పొలం ఉందని గతంలో ఒక సందర్భంలో వెల్లడించగా ఆ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఆదిరెడ్డి జెన్యూన్ గా ఉన్నారా? లేక ఆడియన్స్ ను చీట్ చేశారా? అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

డబ్బు ఉండి కూడా బిగ్ బాస్ హౌస్ లో ఏమీ లేని వ్యక్తిలా ఆదిరెడ్డి నాటకాలు ఆడాడని రివ్యూవర్ కామెంట్లు చేస్తున్నారు.

ఆదిరెడ్డి బిగ్ బాస్ షో వాల్యూ పోగొట్టాడని సదరు రివ్యూవర్ కామెంట్ చేశారు.

అయితే ఈ కామెంట్ల గురించి ఆదిరెడ్డి తనకు ఆస్తులు ఎవరిచ్చారంటూ కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆదిరెడ్డి, రివ్యూవర్లలో ఎవరు చెప్పింది నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. """/"/ ఆదిరెడ్డి బిగ్ బాస్ షో ద్వారా భారీ స్థాయిలోనే రెమ్యునరేషన్ అందింది.

ఆదిరెడ్డి హైదరాబాద్ కు షిప్ట్ కావాలని బిగ్ బాస్ కంటెస్టెంట్లలో చాలామంది కోరారు.

రాబోయే రోజుల్లో ఆదిరెడ్డి హైదరాబాద్ కు షిప్ట్ అవుతారేమో చూడాలి.ఆదిరెడ్డి కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ఆదిరెడ్డి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : హాట్ హాట్‌ ట్రంప్ – బైడెన్ డిబేట్ .. ఇద్దరూ తగ్గట్లేదుగా ..!!