ప్రస్తుతం కాలంలో ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తోంది.ఎక్కడైకెళ్లిన ఆధార్ కార్డు అవసరం చాలా ఉంటోంది.
దీంతో అన్నింటికి ఆధార్ కార్డును లింక్ చేయాల్సి వస్తోంది.మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డును లింక్ చేశారా? లేదంటే ఇప్పుడు చేయండి.
పాన్ కార్డ్, ఆధార్ కార్డును లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు గడువును పొడిగించింది.ఈ ఏడాది మార్చి 31న పాన్ కార్డ్, ఆధార్ కార్డును లింక్ చేసుకునే గడువు ముగిసింది.
ఆ తర్వాత కేంద్రం ఆ గడువును 2021 జూన్ 30 వరకు పొడిగించింది.దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న కారణంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి.
దీంతో పాన్ కార్డ్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో అవకాశాన్ని ఇచ్చింది.అందుకోసం ఆదాయపు పన్ను శాఖ గడువు పెంచింది.
పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి మరో 38 రోజుల వరకు అవకాశం ఉంది.ఇప్పటికే దేశంలోని చాలా మంది తమ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ను లింక్ చేశారు.
ఒకవేళ మీరు మీ పాన్ కార్డు, ఆధార్ కార్డును లింక్ చేసినట్లయితేమీ ఆధార్ కార్డు, పాన్ కార్డు నంబర్లు లింక్ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు.అందుకోసం కింద సూచించిన స్టెప్స్ ను ఫాలో అవ్వండి.
-> ముందుగా మీరు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ Https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/AadhaarPreloginStatus.
Html కి వెళ్లాలి.< -->-> వెబ్ సైట్ కి వెళ్లిన తర్వాత అక్కడ 2 బాక్సులు కనబడతాయి.
PAN అని ఉన్న బాక్సులో మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ అని ఉన్న బాక్సులో మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయండి.పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఒకసారి కరక్టేనా? కాదా? ఓసారి చెక్ చేసుకోండి.
క్లిక్ పూర్తిగా చదవండి ఆ తర్వాత View Link Aadhaar Status పైన క్లిక్ చేయండి.Your PAN Linked To Aadhaar Number అని మెసేజ్ కనిపిస్తే ఆధార్ నెంబర్ కు మీ పాన్ నెంబర్ లింక్ అయినట్లు అర్థం.
మనం ఇన్ కమ్ టాక్స్ శాఖ వెబ్ సైట్ కాకుండా ఎస్ఎంఎస్ ద్వారా కూడా పాన్, ఆధార్ లింక్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.UIDPAN < 12 Digit Aadhaar Number> < 10 Digit Permament Account Number> అని టైప్ చేసి 567678 లేదా 56161 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే తెలుసుకోవచ్చు.
క్లిక్ పూర్తిగా చదవండి