లక్షల తేళ్లను పెంచుకుంటున్న యువతి.. చూస్తేనే వణుకు పుడుతుంది
TeluguStop.com
కాలం మారుతుంది అంటే ఏమో అనుకున్నాం గానీ ఇలాంటివి చూసిన తర్వాతే అనిపిస్తుంది.
కొంత మంది అభిరుచులు ఎవరి ఊహకు కూడా అందకుండా ఉంటున్నాయి.ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మాయి కూడా ఇదే కోవకు చెందినదిగా చెప్పుకోవచ్చు.
జంతువులను పెంచుకోవడం చాలా కామన్ అయిపోయింది ఇవాళ రేపు.కానీ కొందరు డిఫరెంట్ గా ఆలోచిస్తూ పాములను కూడా పెంచుకోవడం చూస్తున్నాం.
కాగా ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మాయి మరింత డిఫరెంట్ గా ఆలోచించి ఏకంగా తేళ్లను పెంచుకుంటోంది.
తేలు ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే.అవి కుడితే ఏకంగా ప్రాణాలు కూడా పోతాయి.
మన దేశంలో తేళ్లను ఎవరూ తినరు.కేవలం అవి మనకు బయట మాత్రమే కనిపిస్తుంటాయి.
కానీ ఈ వైరల్ వీడియోలో మాత్రం లక్షలాది తేళ్లు మనకు కనిపిస్తున్నాయి.అన్నీ కూడా ఎరుపు రంగులోనే ఉండటం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇలా కుప్పలు కుప్పలుగా ఉన్న తేళ్లను ఆమె ఓ పెద్ద జాలితో పట్టుకుని కిందపోయడం మనకు కనిపిస్తోంది.
అన్ని తేళ్ల నడుమ ఆమె ఎంతో ధైర్యంగా ఉంది.అయితే అవి ఆమె మీదకు ఎక్కకుండా కరవకుండా ఉండటం షాక్.
"""/"/
మరి ఇన్ని తేళ్లను ఎందుకు పెంచుకుంటోంది అనుకుంటున్నారా.ఏమీ లేదండి చేపలు, గొర్లు లాగే వాటిని కూడా తినేందుకు పెంచుకుంటున్నారంట.
వినేదుకు కాస్త ఆశ్చర్యకరంగానే ఉన్నా కూడా ఇదే నిజమండి బాబు.వాటిని తినేందుకు పెంచుకుంటున్నారు.
నల్లటి దుస్తులు వేసుకున్న బాలిక ఆ తేళ్లతో చేస్తున్న సాహసం చూస్తుంటే నిజంగానే భయంకరంగా ఉంది.
ఆమె తన సేఫ్టీ కోసం కాళ్లకు రబ్బర్ బూట్లు వేసుకోవడం కూడా ఇందులో చూడొచ్చు.
అయితే దీన్ని చూసిన నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు పెడుతున్నారు.వీటిని కూడా తింటారా అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
జై హనుమాన్ గురించి క్రేజీ అప్ డేట్స్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. అలా చెప్పడంతో?