సాగర్ కెనాల్ వద్ద సెల్ఫీ దిగుతూ కాలువలో పడ్డ యువతి

నల్లగొండ జిల్లా:సెల్పీ( Selfie ) మంచిదే కానీ,ప్రాణం పోతే ఎట్లా అనేది ఆలోచన చేయకపోవడమే విచారకరమని అంటున్నారు.

ఇలాంటి ఘటనే శుక్రవారం నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.

ఉదయం హైదరాబాద్( Hyderabad నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఓ కుటుంబం సాగర్ ఎడమ కాలువ వద్ద ఆగి సెల్ఫీ దిగుతుండగా ఓ యువతి కాలుజారి కాలువలో పడి,నీటి ఉధృతికి కొట్టుకుపోతుంది.

అటుగా వెళుతున్న గాజులాపురం గ్రామానికి చెందిన యువకులు కాలువలోకి దూకి తాళ్ల సహాయంతో మహిళను రక్షించేందుకు తీవ్రంగా శ్రమించారు.

దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి ఆమెను ప్రాణాలతో బయటకు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వెంటనే స్పందించి యువతి ప్రాణాలు కాపాడిన యువకులను పలువురు అభినందించారు.ఏం సెల్పీనో ఏమో.

ఎన్ని ప్రమాదాలు జరిగినా,ఎన్ని ప్రాణాలు పోయినా సెల్పీపై మోజు మాత్రం పోవడం లేదు.

ఒళ్ళు బలిసి ఈ వీడియో పెట్టాను.. జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు!