హీరో లాగా చిన్నారిని కాపాడిన యువకుడు.. వీడియో వైరల్..

తాజాగా ఒక వ్యక్తి తన అప్రమత్తతతో చాకచక్యంగా ఒక పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డాడు.

అంతేకాదు తనతో ఉన్న చిన్నారిని హీరోలాగా కాపాడి అందరి పొగడ్తలను అందుకుంటున్నాడు.దీనికి సంబంధించిన వీడియోని పీయూష్ రాయ్ అనే ఒక జర్నలిస్ట్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఆ వీడియో కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.దీనికి ఇప్పటికే 8 వేలకు పైగా వ్యూస్, వందల్లో లైకులు వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు స్కూటీపై కూర్చోవడం చూడవచ్చు.అతడు తన ముందు ఒక చిన్న పిల్లను కూడా కూర్చోబెట్టుకున్నాడు.

అయితే సరిగ్గా అతని తల పైన ఒక భవనం ఉంది.ఆ భవనం నిర్మాణంలోని పైభాగం బాగా వర్షాలకు తడిసి కూలిపోయేలా ఉంది.

ఈ విషయాన్ని కింద నుంచి గమనించగలిగాడు ఆ యువకుడు.అలా గమనిస్తున్నప్పుడే ఆ నిర్మాణ శిథిలాలు ఒక్కసారిగా కూలి కిందపడటం స్టార్ట్ చేశాయి.

దీనిని గమనించిన ఆ యువకుడు రెప్పపాటు సమయంలో తన చిన్న పిల్లను ఎత్తుకొని శరవేగంగా ఒక షాపులోకి దూసుకెళ్ళాడు.

సరిగ్గా అతడు ఉన్న ప్రాంతంలోనే ఆ నిర్మాణ శిథిలాలు పడిపోయాయి.ఆ తాకిడికి అక్కడున్న స్కూటీ అద్దం కూడా పగిలిపోయింది.

"""/"/ ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ చిన్నారి, యువకుడి తలలపై ఇటుక, సిమెంట్ పెళ్లలు పడేవి.

అదే జరిగితే వారి ప్రాణాలు పోయేవి.కానీ యువకుడు మాత్రం చాకచక్యంగా ఈ పెను ప్రమాదం నుంచి బయట పడగలిగాడు.

అలాగే తన పాపను కూడా హీరో లాగా రక్షించాడు.ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

వైరల్ అవుతున్న వీడియోలో తప్పించుకునే క్రమంలో అతడు కింద పడటం చూడవచ్చు.ఆ తర్వాత లేచి షాప్ లోకి వెళ్ళాడు.

ఇద్దరికీ పెద్ద గాయాలు కాలేదని వీడియో చూస్తే తెలుస్తోంది.ఆ యువకుడు కాస్త వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది.

అయినా కూడా వీరిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.దీనిని చూసి యువకుడి ధైర్యాన్ని, తప్పించుకున్న తీరును చాలామంది మెచ్చుకుంటున్నారు.