విజయానికి పేదరికం అడ్డు కాదని నిరూపించిన యువకుడు

సూర్యాపేట జిల్లా:విజయానికి పేదరికం అడ్డు కాదని,కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడో యువకుడు.

వివరాల్లోకి వెళితే.సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన ఎలక సైదులు,రాధ దంపతుల పెద్ద కుమారుడు ఎలక అరుణ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) లో ఉద్యోగం సాధించాడు.

తల్లిదండ్రులు కులవృత్తితో పాటు ఎంతో కష్టపడి అరుణ్ ను చదివించారు.1 నుండి 7 వరకు పెంచికలదిన్నె ప్రభుత్వ పాఠశాలలో,8 నుండి 10 వరకు నేరేడుచర్ల అంజలి స్కూల్లో,డిప్లొమా పాలిటెక్నిక్ నల్గొండ ప్రభుత్వ కళాశాలలో, బీటెక్ మల్లారెడ్డి కళాశాలలో విద్యనభ్యసించాడు.

కృషి పట్టుదలతో కష్టపడి చదివి తొలి ప్రయత్నంలోనే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగం సాధించడంతో బంధువులు,గ్రామస్తులు అభినందించారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?