జీతం సరిపోక దొంగతనానికి పాల్పడి అడ్డంగా బుక్కైన యువకుడు..!
TeluguStop.com
కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది డబ్బు సంపాదించడం కోసం చెడు మార్గాలను వెతుక్కుంటున్నారు.
కష్టపడి సంపాదిస్తే వచ్చే డబ్బు సరిపోని కారణంగా ఓ యువకుడు దొంగతనం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలంలో చోటు చేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.నాగార్జునసాగర్ సీఐ బిసన్న తెలిపిన వివరాల ప్రకారం.
బీహార్ లోని సివాజ్ జిల్లా లోని భగవాన్ పూర్ కు చెందిన నీరజ్ కుమార్ సింగ్ అనే యువకుడు పెద్దవూర మండలంలోని సుంకిసాల ప్రాజెక్టు పైప్ లైన్ పనుల్లో నడుస్తున్న జేసీబీ హెల్పర్ గా పనిచేస్తున్నాడు.
"""/" /
అయితే నీరజ్ కుమార్( Neeraj Kumar ) కు నెలకు రూ.
8 వేల జీతం.ఈ జీతం అతనికి సరిపోయేది కాదు.
ఇక కుటుంబానికి డబ్బులు ఎలా పంపించాలని చింతించేవాడు.డబ్బు సంపాదించడం కోసం దొంగతనాలు చేస్తేనే బాగుంటుందని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలోనే ఈనెల 24న పెద్దవూర మండలంలోని సంగారం గ్రామానికి వెళ్లి బైరోజు భారతమ్మ అనే మహిళ ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న మూడు బంగారు ఉంగరాలతో పాటు రూ.
10వేల నగదును దొంగతనం చేసి అక్కడి నుండి పరారయ్యాడు. """/" /
భారతమ్మ తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అయితే గురువారం ఉదయం నీరజ్ కుమార్ హైదరాబాద్ వెళ్లేందుకు సంగారం స్టేజి వద్ద బస్సు కోసం ఎదురుచూసే సమయంలో అటువైపు పోలీసులు రావడంతో.
వారిని చూసినా నీరజ్ కుమార్ భయపడి అక్కడి నుండి పరుగులు తీశాడు.పోలీసులు( Police ) అనుమానంతో నీరజ్ కుమార్ ను వెంబడించి పట్టుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అతని వద్ద ఉండే బంగారు ఉంగరాలతో పాటు నగదును స్వాధీనం చేసుకుని అతనిని కోర్టులో హాజరు పరిచారు.
యూకేలో 80 ఏళ్ల భారత సంతతి వృద్ధుడి హత్య.. పోలీసుల అదుపులో 12 ఏళ్ల బాలిక