వీడియో వైరల్: చేపలు పట్టేందుకు సరికొత్త టెక్నిక్ వాడుతున్న యువకుడు.. మీరు ట్రై చేస్తారా..

ప్రతిరోజు సోషల్ మీడియా( Social Media ) వేదికగా అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.

ఇందులో అనేక రకాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తూ ఉండడం గమనించాము.

ఇందులో చాలావరకు ఫన్నీ వీడియోస్ ఉంటే మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి.

ఇకపోతే ప్రస్తుతం ఓ యువకుడు తన టెక్నిక్ ఉపయోగించి చేపలను కాస్త వెరైటీగా పట్టుకోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.

ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే. """/" / ఎవరికైనా సరే పని చేసే సమయంలో ఆ పనికి సంబంధించిన టెక్నిక్ తెలిస్తే చాలు మిగతా వారి కంటే ఆ పనిని ఎంతో కష్టమైనా సరే చాలా సులువుగా, సునాయాసంగా చేసేస్తారు.

పని పూర్తి కావడానికి కాస్త బ్రెయిన్( Brain ) ఉపయోగిస్తే చాలు పనిని చిటికలో సాల్వ్ చేయవచ్చు.

ఇకపోతే ఎవరైనా చేపలు పట్టాలంటే ఏం చేస్తారు.ఓ గాలం ఏర్పాటు చేసి దానికి ఏదో ఒక ఎరను ఏర్పాటు చేసి దానిని నీటిలో వదిలి దాంతో చేపలను పట్టుకోడానికి ప్రయత్నిస్తారు.

అయితే ఓ యువకుడు సరికొత్త టెక్నిక్ తో చేపలు పట్టేస్తూ అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ విషయం సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

"""/" / ఈ వీడియోలో ఓ యువకుడు ఒళ్లంతా బురద పూసుకొని చెరువుగట్టుపై పడుకుని ఉంటాడు.

ఆ తర్వాత ఓ సన్నని పైపు తీసుకుని నోట్లో దానిని ఉంచుకొని చెరువులో ఊదుతాడు.

దాంతో నీటిలో వచ్చే బుడగలకు చేపలు అక్కడికి రాగానే ఆ యువకుడు వాటిని అమాంతం చేతితో వడిసిపట్టేసుకుంటూ గట్టు పైకి విసిరేస్తుంటాడు.

అయితే ఈ వీడియో చూసి చేపల వేటగాళ్లు ఇలా కూడా చేపలను పట్టొచ్చా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరికొందరేమో ఇంత సింపుల్ టెక్నిక్ తెలియక ఇన్ని రోజులు అనవసరంగా గాలాలు, వలలు అంటూ తెగ ఖర్చు చేసేస్తున్నాం అని కామెంట్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీలో ఎవరైనా చేపలు పట్టే అలవాటు అంటే ఇలా ఓసారి ట్రై చేసి రిజల్ట్ ఏమైందో కామెంట్ చేయండి.

ఆ సినిమాలకు శాపమైన టికెట్ రేట్లు కల్కికి ప్లస్ అవుతాయా.. టాక్ ముఖ్యం అంటూ?