బైకు అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు

దాతల సహాయం కోసం ఎదురుచూపు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం కు చెందిన మంగలి అక్షయ్ అనే యువకుడు నామపూర్- చీకోడ్ గ్రామాల రహదారి పై పెద్దమ్మ ఆలయం వద్ద బైక్ అదుపుతప్పి తీవ్ర గాయాలు పాలయ్యాడు .

తలకు తీవ్ర గాయాలయ్యాయి.నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో చేతిలో చిల్లి గవ్వలేక దిక్కుతోచని స్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.

ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న వారి కొడుకు మెరుగైన వైద్యం కోసం సాయం కోసం ఎవరైనా దాతలు ఆర్థిక సాయం అందించాలని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు ఆర్థిక సాయం అందజేయాల్సిన దాతలు9100 205991 నెంబర్ కు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఆర్థిక సాయం అందచేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

ఆ హిట్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన గోపీచంద్.. వరుస ఫ్లాపులకు బ్రేక్ పడినట్లేనా?