కోదాడ ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం వికటించి యువకుడు మృతి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం వికటించి యువకుడు శ్రీకాంత్ (25) మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి జరిగింది.
గత మూడు రోజుల క్రితం హాస్పిటల్ లో చేరిన యువకుడికి డాక్టర్ వైద్యం చేశరు.
ఆసుపత్రి నుండి బయటకు వెళ్లిన నాలుగు గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో వైద్యుని నిర్లక్ష్యం వల్లనే మృతి చెందారని ఆరోపిస్తూ
కుటుంబ సభ్యులు, బంధువుల హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.
అనంతరం కోదాడ-హుజూర్నగర్ రోడ్డుపై బైఠాయించిన ధర్నా నిర్వహించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతిని కుటుంబ సభ్యులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
పేకాట మత్తులో నటుడు…. రాజీవ్ కనకాల వద్ద రూ.350 కోట్లు అప్పు చేశారా?