వికేంద్రీకరణకు మద్ధతుగా యువకుడు ఆత్మహత్యాయత్నం..

విశాఖ రాజధాని కావాలంటూ వికేంద్రీకరణకు మద్ధతుగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ ఘటన అనకాపల్లి జిల్లా చోడవరంలో జరిగింది.

దీంతో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.వికేంద్రీకరణకు మద్ధతుగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న ఓ యువకుడు బైకుకు నిప్పుపెట్టాడు.అనంతరం తాను కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.

వెంటనే గమనించిన పోలీసులు యువకుడిని అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.కాగా జై విశాఖ, జై జై విశాఖ నినాదాలతో ర్యాలీ మారు మ్రోగింది.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసి వచ్చాక రిటర్న్ చేస్తున్నారా? ఇకపై బాదుడే