జపాన్‌లో చీర కట్టుకొని చక్కర్లు కొట్టిన భారతీయ యువతి.. వీడియో వైరల్..

శారీ అనేది భారతదేశంలో ఒక ట్రెడిషనల్ ఔట్‌ఫిట్.సాంప్రదాయం వస్త్రమైన చీరను చాలామంది మహిళలు ఇష్టపడతారు.

ఒకప్పుడు భారతీయులు మాత్రమే దీనిపై ప్రేమ పెంచుకునే వారు కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరు మగువలు చీర కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు.

ఇటీవల ప్రపంచ ఫ్యాషన్‌పై చీర చాలా పెద్ద ప్రభావాన్ని చూపుతోంది.బియోన్సే, జిజీ హదీడ్, జెండయా వంటి ప్రముఖ సెలబ్రిటీలు ప్రధాన ఈవెంట్లలో శారీ దుస్తులు ధరించడం ద్వారా చీర పై తమ ప్రేమను చాటుతున్నారు.

అబు జాని సందీప్ ఖోస్లా, రాహుల్ మిశ్రా, గౌరవ్ గుప్తా, సబ్యసాచి ముఖర్జీ వంటి ప్రముఖ భారతీయ డిజైనర్లు ఈ ధోరణిలో కీలక పాత్ర పోషించారు, వారి డిజైన్‌లు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడుతున్నాయి.

"""/" / ఉదాహరణకు, దీపికా పదుకుణే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చీరలో మెరిసి ఆకట్టుకుంది.

అలియా భట్ 2024లో మెట్ గాలా( Alia Bhatt )లో కూడా చీర ధరించి ప్రపంచ వేదికపై శారీ అందాన్ని హైలైట్ చేసింది.

సెలబ్రిటీలు మాత్రమే కాదు కంటెంట్ క్రియేటర్లు కూడా ఇతర దేశాలలో చీర అందాలను చూపిస్తూ దాని ప్రాముఖ్యతను తెలియజేస్తున్నారు.

రీసెంట్‌గా జపాన్‌( Japan )లోని టోక్యో వీధుల్లో ఒక మహిళా చీరకట్టులో సందడి చేస్తూ కనిపించింది.

చీరలో ఆమె చాలా అందంగా ఉంది.ఆ కట్టు బొట్టు ఆమె అందం స్థానికుల దృష్టిని ఆకర్షించింది.

"""/" / ఈ వీడియో 70 లక్షలకు పైగా వ్యూస్‌తో సూపర్ హిట్ అయ్యింది.

వీడియోలో, ఆ మహిళ బ్లూ శారీ( Blue Saree )ని ధరించింది.గోల్డెన్ బోర్డర్ డిజైన్‌తో శారీ బాగా ఉంది ఈ చీరతో పాటు ఆమె అందంగా ముస్తాబు అయింది.

ఆమె చురుగ్గా తిరుగుతూ, ఎంజాయ్ చేస్తోంది.ఆమె మాములు బ్లౌజ్ కాకుండా, ట్రెండ్‌లో ఉన్న ట్యూబ్ బ్లౌజ్ ధరించి ఉంది.

ఈ డిజైన్‌కు కొంతమంది ఫిదా అయ్యారు, మరికొందరు బ్లౌజ్ డిజైన్‌ను విమర్శించారు, అది శారీకి సరిపోదని అభిప్రాయపడ్డారు.

ఈ విమర్శలకు భిన్నంగా, చాలా మంది ఆమె ఎంపికను సమర్థించారు.బ్రిటిష్ పాలన వచ్చే వరకు శారీలు బ్లౌజ్ లేకుండా లేదా పెటికోట్ లేకుండా ధరించేవారని వారని కొంతమంది గుర్తు చేశారు.

ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌లోకి శారీ ఏంట్రీ ఇవ్వడాన్ని బట్టి చూస్తుంటే దాని అందం ఎప్పటికీ నిలిచి ఉంటుందని అర్థమవుతోంది.

అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టి సంబరాలు.. భారతీయుడు చేసిన పనికి నెటిజన్లు షాక్..