వీడియో వైరల్‌.. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ బ్రాండ్ న్యూ కారు కొన్న యువ జంట

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయింది.ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం అనేక మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరికొందరు పార్ట్ టైం జాబ్ లాగా చేస్తూ, ఇంకా కొందరు ప్రమోషన్స్, ఇతర రెవెన్యూ తో ఫేమస్ అయ్యి డబ్బులను బాగా సంపాదించుకుంటున్నారు.

ఇక మరికొందరు అయితే, కేవలం ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన డబ్బుతోనే వారు జీవితాన్ని కొనసాగిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

పేరుకు పేరు.డబ్బుకు డబ్బు అన్నట్లు సోషల్ మీడియా స్టార్స్ క్రియేటర్స్ పదుల సంఖ్యలో ఎప్పటికి అప్పుడు ఫేమస్ అవుతూనే ఉంటారు.

అచ్చం అలాగే ఇంస్టాగ్రామ్ లో ఫేమస్ గా ఉన్న ఒక కేరళ( Kerala ) జంట శీతల్‌ ఎల్జా, విను వినేశ్ ( Sheetal Elza, Vinu Vinesh )తాజాగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును కొనుగోలు చేశారు.

"""/" / ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వీరిద్దరూ 2021లో వివాహం చేసుకున్నారు.వీరికి ఒక పాప కూడా ఉంది.

ఈ క్రమంలో వారు కారు డెలివరీ తీసుకునే సమయంలో శీతల్‌ ఎల్జా భర్త వినేశ్ బ్లాక్ కలర్ కారును షోరూమ్ కు వెళ్లి కారు డెలివరీ తీసుకున్నారు.

ఇలా డెలివరీ తీసుకున్న అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ముందుగా కారులోకి వెళ్లిన వినేశ్‌ ఆ తర్వాత శీతల్‌ చేతిని పట్టుకొని మొదటిసారి ఎక్స్‌యూవీ 700లోకి ఎంతో ప్రేమగా ఆహ్వానించాడు.

"""/" / అంతే కాకుండా కారు నడుపుతూ షోరూం నుంచి ఇద్దరు బయటికి వచ్చారు.

అనంతరం వారు ఆ కారుని చర్చికి తీసుకొని వెళ్లి చిన్నారితో కలిసి ప్రార్థనలు నిర్వహించినట్లు మనం వీడియోలో చూడవచ్చు.

వాస్తవానికి ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కొనుగోలు చేసిన కార్లకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.

ఏదిఏమైనా ఇలా సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్ ఈ రేంజ్ లో సంపాదించాడంటే ఆలోచించాల్సిన విషయమే.

కెనడాలో ముగిసిన కాన్సులర్ క్యాంప్‌లు .. ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఎంబసీ