వైరల్: మెట్రోలో జనాలు లేకపోవడం చూసి, రెచ్చిపోయిన యువతి… మండిపడుతున్న నెటిజన్లు!

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తేనే అర్ధం అయిపోతుంది.

నేటి యువత పాపులర్ కావడానికి ఎంతలా దిగజారి పోతున్నారో తెలియడానికి.వైరల్ కావడం కోసం, లైక్స్ కోసం ఏం చేయడానికైనా వారు సిద్ధపడిపోతున్నారు.

ఈ క్రమంలో వారు సమాజాన్ని కాదు కదా, ఆ సమయంలో తమ చుట్టూ ఎంతమంది వున్నా పట్టించుకోవడం లేదు.

పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు.ఇదేంటి అని ఎవరన్నా అడిగితే.

ఇది సోషల్ మీడియా ప్రమోషన్ అంటూ చెబుతున్నారు. """/" / అయితే సదరు వీడియోలు చూసి నెటిజన్లు మాత్రం ఇదేం పోయేకాలంరా బాబు అని తెగ తిడుతున్నారు.

ముఖ్యంగా ఈమధ్య చూసుకుంటే, చాలా మంది మెట్రో ట్రైన్‌ల్లో వింత వింత పనులు చేసి వాటిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు.

అలా చేయడం తప్పని తెలిసినా కూడా ఎవరూ ఆ నియమాలను పట్టించుకోవడం లేదు.

తాజాగా ఓ యువతి వెరైటీ డ్రెస్ ధరించి ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో ఓ పాటకు డ్యాన్స్ చేయడం ఇపుడు కలకలం సృష్టిస్తోంది.

"""/" / ఆమె ఓ బాలీవుడ్ హీరోయిన్ లాగా ఫీల్ అయిపోయి చేసిన బెల్లీ డాన్స్( Belly Dance ) ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇకపోతే ఇతర ప్రయాణీకులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించవద్దని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా ఢిల్లీ మెట్రో కోరిన సంగతి విదితమే.

అయినా కొందరు ఆ విజ్ఞప్తిని పట్టించుకోపోగా మరింత రెచ్చిపోయి డాన్సులు చేస్తున్నారు. """/" / తాజాగా రైలులో ఓ అమ్మాయి పంజాబీ పాటకు( Punjabi Song ) డ్యాన్స్ చేసిన వీడియో దర్శనం ఇచ్చింది.

ఈ వీడియోలో ఆ అమ్మాయి మాస్క్ ధరించి ఉండడంతో ఆమె మొహం కనబడడం లేదు.

కాగా ఆమె చర్యతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

రూపాయి ఖర్చు లేకుండా జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!