పార్సెల్ వచ్చిన హెయిర్ డ్రైయర్ పేలి చేతులను కోల్పోయిన మహిళ

కర్ణాటకలోని బాగల్‌కోట్‌ ( Bagalkot In Karnataka )జిల్లాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.

ఇల్కల్ నగరంలో హెయిర్ డ్రయ్యర్ ( Hair Dryer )పేలి మరణించిన సైనికుడి భార్య రెండు చేతులు కోల్పోయింది.

ప్రస్తుతం మహిళ ఆసుపత్రిలో చేరింది.ఆమె స్నేహితురాలు హెయిర్ డ్రైయర్‌ని ఆర్డర్ చేసిందని, పొరుగుంటిలోని శశికళకు వెళ్లాల్సిన హెయిర్ డ్రైయర్ పార్సిల్‌ని ఆమె ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఆ మహిళా తీసుకుంది.

డీటీడీసీ కొరియర్ ద్వారా వచ్చిన పార్సిల్ లో దానిపై శశికళ పేరు, మొబైల్ నెంబర్ ఉందని బాధితురాలు తెలిపింది.

అలా అందుకున్న ఆమె పార్సెల్ ఓపెన్ చేసి హెయిర్ డ్రైయర్ స్విచ్ ఆన్ చేయగా, అది పేలి మహిళ రెండు చేతులు తీవ్రంగా కాలిపోయాయి.

వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించడంతో రెండు చేతులను తొలగించాల్సి వచ్చింది.ఆ బాధిత మహిళ పేరు బసమ్మ.

ఆమె బాగల్‌కోట్ జిల్లా ఇల్కల్ పట్టణంలో నివసిస్తోంది.ఆ మహిళ భర్త పేరు పాపన్న( Papanna ).

అతను సైన్యంలో ఉన్నాడు.బసమ్మ భర్త పాపన్న 2017లో జమ్మూకశ్మీర్‌లో షార్ట్ సర్క్యూట్‌తో చనిపోయాడు.

ఇరుగుపొరుగున ఉండే శశికళ అనే మహిళతో బసమ్మకు మంచి స్నేహం ఉందని చెబుతున్నారు.

శశికళ ఏదో పని నిమిత్తం వేరే ఉరికి వెళ్ళింది.ఇంతలో కొరియర్ నుండి ఒక పార్శిల్ వచ్చింది.

పార్శిల్‌పై ఉన్న శశికళ మొబైల్ నంబర్‌ను చూసి కొరియర్ కంపెనీ ఉద్యోగి శశికళకు ఫోన్ చేసి ఆమె పేరు మీద పార్శిల్ వచ్చిందని చెప్పాడు.

దాంతో శశికళ మాట్లాడుతూ.ప్రస్తుతం నేను వేరే నగరంలో ఉన్నాను తెలిపినా.

కొరియర్ ఉద్యోగి శశికళకు పదే పదే ఫోన్ చేసి తన కొరియర్ రిసీవ్ చేసుకోమని అడిగాడు.

కొరియర్ ఉద్యోగి నుంచి వచ్చిన కాల్స్‌తో విసిగిపోయిన శశికళ తన స్నేహితురాలు బసమ్మకు ఫోన్ చేసి నా పార్శిల్ వచ్చిందని, తీసుకోండి అని చెప్పింది.

"""/" / శశికళ పిలుపు మేరకు కొరియర్ ఉద్యోగి ( Courier Employee )నుంచి బసమ్మకు పార్శిల్ వచ్చింది.

పార్శిల్ తెరిచి చూసేసరికి లోపల హెయిర్ డ్రయ్యర్ ఉందని బసమ్మ చెప్పింది.అదే సమయంలో అక్కడ ఉన్న మరో వ్యక్తి దాన్ని ఆన్ చేసి చూపించమని అడిగాడు.

దాంతో ఆమె హెయిర్ డ్రైయర్ స్విచ్ ఆన్ చేయగా అది పేలిపోయింది.పేలుడు ధాటికి ఆమె చేయి విరిగి, వేళ్లు విరిగిపోయాయి.

ఇంట్లో అంత రక్తం మరకలు పడ్డాయి.ఇరుగుపొరుగు వారు ఘనటనను చూసి హడావుడిగా ఇల్కల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించడంతో వైద్యులు ఆపరేషన్‌ సమయంలో రెండు చేతులు తీసేయాల్సి వచ్చింది.

"""/" / ఈ విషయం తెలుసుకున్న శశికళ కూడా హడావుడిగా ఆసుపత్రికి చేరుకుని బసమ్మ పరిస్థితిని తెలుసుకుంది.

అయితే ఆసుపత్రిలో శశికళ చెప్పిన విషయాలు మరింత ఆశ్చర్యం కలిగించాయి.శశికళ చెప్పినట్లు ఆమె హెయిర్ డ్రయ్యర్ కూడా ఆర్డర్ చేయలేదని, అయితే ఆమె పేరు మీద హెయిర్ డ్రైయర్ పార్శిల్ ఎలా వచ్చింది? డబ్బులు ఎవరు ఇచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని ఓ కంపెనీలో హెయిర్ డ్రయ్యర్‌ను తయారు చేసినట్లు కూడా వెల్లడైంది.

దింతో ఈ పేలుడు పలు అనుమానాలకు తావిస్తోంది.ఘటనపై సమాచారం అందుకున్న హునగుండ ఎమ్మెల్యే విజయానంద్‌ కాశప్పన్‌ కూడా ప్రైవేట్‌ ఆస్పత్రికి చేరుకున్నారు.

గాయపడిన బసమ్మ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.బసమ్మను కూడా కలిశారు.

బసమ్మ భర్త పాపన్న ఇండియన్ ఆర్మీలో ఉండేవాడని చెప్పారు.2017లో జమ్మూ కాశ్మీర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.

ప్రస్తుతం ఘటనపై విచారణ జరుగుతోంది.

కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..!