పాస్తా కంపెనీపై కోర్టులో రూ.40 కోట్లకు దావా వేసిన మహిళ.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సాధారణంగా కంపెనీలు నిజ జీవితంలో సాధ్యం కాని విషయాలను చెప్పి తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకుంటుంటాయి.

రెడ్ బుల్ గివ్స్‌ యూ వింగ్స్ అనే ట్యాగ్స్‌తో రెడ్ బుల్ కంపెనీ ఎనర్జీ డ్రింక్ అమ్ముతోంది.

నిజానికి ఈ ఎనర్జీ డ్రింక్ తాగినా ఎవరికి రెక్కలు రావు.ఇక ఫుడ్ విషయానికి వస్తే మ్యాగీ కంపెనీ కూడా తమ మ్యాగీ నూడుల్స్ కేవలం రెండు నిమిషాల్లో రెడీ అయిపోతాయని చెబుతుంటుంది.

కానీ ఇది సాధ్యం కాదు.ఇలా అబద్ధాలు చెప్పేస్తున్నా మన ఇండియాలో వీటి గురించి ఎవరూ పట్టించుకోరు.

కాగా ఫ్లోరిడాలో ఒక మహిళ మాత్రం 'మూడు నిమిషాల్లో పాస్తా ఉడుకుతుంది' అని చెప్పిన కంపెనీపై చాలా సీరియస్ అయ్యింది.

అంతేకాదు ఆ కంపెనీపై ఏకంగా రూ.40 కోట్లు దావా ఫైల్ చేసింది.

ఫ్లోరిడాకు చెందిన ఈ మహిళ వేసిన కేసు గురించి ఇప్పుడు చాలామంది చర్చించుకుంటున్నారు.

ఈ మహిళ పేరు అమాండా రెమీ రేజ్.ఈమె కొద్ది రోజుల క్రితం క్రాఫ్ట్ హీంజ్ కంపెనీ తయారుచేసిన వెల్వెటా షెల్స్ పాస్తా అండ్ ఛీజ్‌ను కొనుగోలు చేసింది.

ఈ ప్రొడక్ట్ కవర్‌పై మైక్రోవేవ్‌లో ఉడికిస్తే మూడున్నర నిమిషాల్లో రెడీ అయిపోతుందని రాసి ఉంది.

ఆ మహిళా అది నిజమైన అనుకొని మూడున్నర నిమిషాల పాటు దానిని మైక్రోవేవ్‌లో ఉడికించింది.

కానీ ఆ సమయంలో పాస్తా అండ్ ఛీజ్ ఉడకలేదు. """/"/ దాంతో తీవ్ర కోపానికి గురైన ఆమె పాకెట్ మీద ఉన్న వివరాలన్నీ ప్రజలను పక్కదారి పట్టించేలా ఉన్నాయని కేసు వేసింది.

చెప్పినట్లుగా మూడున్నర నిమిషాల్లో పాస్తా ఉడకలేదు కాబట్టి నష్టం పరిహారం కింద రూ.

40 కోట్లు చెల్లించాలని కోర్టులో కేసు వేసింది.కాగా ఈ కేసు సంచలనంగా మారింది.

ఈ వ్యవహారంలో జడ్జిలు ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.

నథింగ్ నుంచి 2 సరికొత్త ఇయర్ బడ్స్ లాంఛ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?