ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం.. ఫైన్ కోసం తాళిని తీసిన మహిళ.. !
TeluguStop.com
సామాన్యునికి ట్రాఫిక్ చలాన్లు పెనుభారంగా మారిన విషయం తెలిసిందే.ఒక వైపు ధరల బాదుడు, మరో వైపు ఇందన ధరలు వెరసి ముందు ముందు మనుషులను బ్రతకనిచ్చేలా లేవని ఆవేదన పడుతున్నాడట సగటు జీవి.
ఈ పరిస్దితుల్లో చాలీచాలక బ్రతికే బదులు దొంగతనాలకు ఇప్పుడున్న పరిస్దితులు ప్రేరేపించిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని అంటున్నారు.
ఇకపోతే కర్ణాటకలోని బెలగావిలో భారతి విభూతి అనే 30 ఏళ్ల మహిళ, ఆమె భర్త హుక్కేరిలోని హుల్లొలిహట్టి గ్రామంలో హోటల్ నడుపుతు జీవనాన్ని సాగిస్తున్నారట.
ఈ క్రమంలో హోటల్ పని నిమిత్తం వారిద్దరు సిటీకి వచ్చారట.ఆ పని ముగిసాక తిరిగి ఇంటికి వెళ్లుతున్న సమయంలో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్నందుకు వారిని ఆపిన ట్రాఫిక్ పోలీసులు రూ.
500 జరిమానా విధించారట.తమ దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవని చెప్పినా వినకుండా జరిమానా కట్టాల్సిందేనని వారితో వాదనకు దిగారట ట్రాఫిక్ పోలీసులు.
ఇలా దాదాపు రెండు గంటల పాటు వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందట.
చివరికి చేసేది ఏం లేక ఆ మహిళ తన మెడలోని తాళిని తీసిన ఓ ట్రాఫిక్ పోలీస్ చేతిలో పెట్టి దీన్ని అమ్మి మీ డబ్బులు తీసుకోవాలని కోరిందట.
కాగా అదేసమయంలో అటుగా వచ్చిన ఓ సీనియర్ పోలీసు అధికారి దృష్టిలో ఈ ఘటన పడగా అతను ఆ దంపతులను అక్కడి నుండి పంపించి వేశాడట.
సస్పెన్స్‌కు తెర.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ.. షెడ్యూల్ ఇలా