వాడపల్లి వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి

నల్లగొండ జిల్లా: దామచర్ల మండలం వాడపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది.

ఇటుకల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టగా ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న మంద విమల (37) అనే మహిళ మృతి చెందగా మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

గేమ్ ఛేంజర్ లో చరణ్ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తారా.. వైరల్ వార్తల్లో నిజమెంత?