దారుణం.. భర్త పురుషాంగంపై సలసల కాగే నీటిని పోసిన భార్య..!

ఆంధ్రప్రదేశ్ పలనాడు జిల్లాలో( Palnadu District ) ఆదివారం ఉదయం ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

కుటుంబ కలహాల నేపథ్యంలో భాగంగా ఓ భార్య తన భర్త మర్మాంగం పై వేడి నీళ్లు( Hot Water ) పోసి హత్యాయత్నం చేయబోయింది.

ఈ సంఘటనలో భర్తకు కలిగిన గాయాల కారణంగా ఆసుపత్రిలో చేర్పించి అతనికి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయం సంబంధించి భర్త తన అత్తమామలు, తన భార్యతో కలిసి తనను చంపేందుకు కుట్ర చేస్తున్నట్లు ఆరోపించాడు.

ఇందుకు సంబంధించి పోలీసుల వద్ద బాధితుడు వాపోయాడు.ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ విషయం సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.వినుకొండ నగరంలోని హనుమాన్ నగర్ కు చెందిన అనూషతో( Anusha ) ప్రభుదాస్ కు వివాహం జరిగింది.

పెళ్లయిన కొత్తలో వీరి ఇరువురు బాగానే ఉన్నా రానురాను వారి మధ్య కలహాలు ఏర్పడి భేదాభిప్రాయాలు తలెత్తాయి.

దీంతో కొద్దిరోజుల నుంచి భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా జీవనం కొనసాగిస్తున్నారు.అయితే వారి కలహాల నేపథ్యంలో పెద్దల సమక్షంలో కుదిరిన రాజి కారణంగా మళ్లీ ఇద్దరు కలిసి ఉంటున్నారు.

దాంతో అనుష భర్తతో కాపురం చేయడానికి తిరిగి వచ్చింది.ఇకపోతే కాపురం చేయడానికి వచ్చిన అనూషలో ఎటువంటి మార్పులు రాలేదు.

"""/" / దీంతో ఎప్పటి లాగే భార్యాభర్తల విషయంలో గొడవలు మళ్లీ జరిగేవి.

ఇదే కారణంతో తాజాగా తెల్లవారుజామున ఆదివారం నాడు భార్య దారుణ సంఘటనకి పాల్పడింది.

నిద్రిస్తున్న తన భర్త మీద చాలా మరిగిన వేడి నీళ్లను పోసింది.ఆ సమయంలో మంచి నిద్రలో ఉన్న ప్రభుదాస్( Prabhudas ) ఒక్కసారిగా పెద్దగా కేకలు వేశాడు.

భార్య తన భర్త మర్మాంగం మీద వేడి నీటిని పోవడంతో అతడు విలువిల్లాడిపోయాడు.

"""/" / గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వెంటనే అతని ఇంటికి చేరుకుని పరిస్థితిని గమనించిన వారు ఆసుపత్రికి తరలించారు.

అయితే వేడి నీళ్ల కారణంగా మర్మాంగంతో పాటు ప్రభుదాస్ పొట్ట భాగంలో కూడా గాయాలైనట్లు తెలుస్తోంది.

అయితే ఇలా భార్య ప్రవర్తించడానికి కారణం అత్తమామలంటూ బాధితుడు పోలీసుల వద్ద వాపోయాడు.

బాద్యుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న భర్త పట్ల ఇంతలా ప్రవర్తించాలా అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

వైరల్ వీడియో: వరుడు డాన్స్ చేస్తుండగా.. మొత్తం పరువు తీసావు కదయ్యా..