సైబర్ వలలో చిక్కిన వితంతు మహిళ.. అత్యాశతో రూ.1.50 కోట్ల పెట్టుబడి..!
TeluguStop.com
అత్యాశ మనిషిని ఆలోచించకుండా నట్టేట మునిగిపోయేలా చేస్తుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనం.
ఓ మహిళ కు తన భర్త చనిపోయాక రూ.1.
50 కోట్ల ఇన్సూరెన్స్ వచ్చింది.సైబర్ నెరగాళ్లు ఆ మహిళకు పెట్టుబడి పేరుతో అత్యాశ చూపించి మొత్తం డబ్బు కాజేసిన ఘటన హైదరాబాద్ లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఎల్బీనగర్( Police Commissionerate LB Nagar ) లో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ లో నివసిస్తున్న 48 ఏళ్ల మహిళ యొక్క భర్త కొద్ది రోజుల క్రితం మరణించాడు.
ఆమె భర్తకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కోటిన్నర వచ్చాయి.ఈ విషయం సైబర్ నేరగాళ్లకు( Cyber Criminals ) ఎలా తెలిసిందో తెలియదు కానీ ఆ సైబర్ నేరగాళ్లు బాధిత మహిళకు ఫోన్ చేసి పెట్టుబడి పెడితే డబుల్ డబ్బులు వస్తాయని నమ్మకపు మాటలు పలికారు.
ఆ మహిళ తో పెట్టుబడులు పెట్టించి రూ.5 లక్షల( 5 Lakhs ) వరకు చెల్లించారు.
దీంతో బాధిత మహిళ సైబర్ నేరగాలను పూర్తిగా నమ్మేసింది. """/" /
ఇక మంచి సమయం చూసుకుని సైబర్ నేరగాళ్లు కోటిన్నర పెట్టుబడి పెడితే రూ.
మూడు కోట్ల రూపాయలు వస్తాయని అత్యాశ చూపించారు.ఒక్కసారిగా మూడు కోట్లు వస్తాయని అత్యాశకు పోయిన ఆ మహిళ ఈ విషయం గురించి ఎవరితో చర్చించకుండా ఆ సైబర్ నేరస్థుడు ఇచ్చిన ఖాతాకు డబ్బులు అన్ని బదిలీ చేసేసింది.
బ్యాంక్ అధికారులు ఇలా ఒకటేసారి అంత మొత్తం ఒకే ఖాతాకు బదిలీ చేయడం సరి కాదని, ఇలా చేస్తే మోసపోయే అవకాశాలు ఉంటాయని హెచ్చరించిన ఆ మహిళ బ్యాంక్ అధికారుల మాటలను పెడచెవిన పెట్టి కోటిన్నర రూపాయలను బదిలీ చేసింది.
"""/" /
ఆ తరువాత రెండు నెలల పాటు ఆ బాధిత మహిళను సైబర్ నేరగాళ్లు మభ్యపెట్టి అధిక మొత్తంలో డబ్బు వస్తుందని ఆశ పుట్టించారు.
కానీ డబ్బులు ఇవ్వాలని ఆ మహిళ అడగడంతో అవతల వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వెంటనే బాధిత మహిళ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ కోటిన్నర మొత్తం ఏకంగా 600 బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లినట్లు తెలిసింది.
ఈ బ్యాంకు ఖాతాలో ఒక బ్యాంకు ఖాతా కోల్ కత్తా కు చెందినదిగా గుర్తించారు.
పోలీసులు ఈ ఖాతాలను గుర్తించి వాటిని క్రోడీకరించి సైబర్ నేరగాళ్లను పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు.
బిగ్‌బాసుకి ఏమయ్యింది? ఈ ఎంపికలేంట్రా బాబూఅని బోరుమంటున్న ప్రేక్షకులు!