మిర్యాలగూడ తొలి సబ్ కలెక్టర్ కు ఘన స్వాగతం

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ( Miryalaguda )రెవెన్యూ డివిజన్ కు సబ్ కలెక్టర్ హోదా దక్కిన విషయం తెలిసిందే.

గురువారం తొలి సబ్ కలెక్టర్ గా ఐఏఎస్ అధికారి నారాయణన్ అమిత్ బాధ్యతలు స్వీకరించడంతో ఆ హోదా పరిపూర్ణమైంది.

పరిపాలనా సౌలభ్యం కోసం జూన్ 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 15 రెవిన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్ హోదాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

అందులో భాగంగా మిర్యాలగూడకు కూడా సబ్ కలెక్టర్ హోదా దక్కింది.రాష్ట్రంలో సబ్ కలెక్టర్ హోదా కల్పించిన రెవెన్యూ డివిజన్లలో మిర్యాలగూడతో పాటు ఉట్నూరు,భద్రాచలం,కాటారం,కామారెడ్డి,బాన్సువాడ,కల్లూరు,కాగజ్ నగర్,బెల్లంపల్లి, అచ్చంపేట,దేవరకొండ,బోధన్,బైంసా, నారాయణఖేడ్,తాండూరు ఉన్నాయి.

ఇంత కాలం ఆర్డీవోగా విధులు నిర్వహించిన శ్రీనివాసరావు రిలీవ్ అయ్యారు.నూతన సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణన్ అమిత్ ( Narayanan Amit )కు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,డిఎస్పీ రాజశేఖర్ రాజు స్వాగతం పలికి,శుభాకాంక్షలు తెలిపారు.

పెళ్లి కూతురు ముందే వరుడి చెవిలో గుసగుసలాడిన ఫ్రెండ్.. చివరకు?