వైజాగ్‌లో జగన్‌ పార్టీ చేస్తున్న పనిపై వాట్సాప్‌లో వైరల్‌ అయిన పోస్ట్‌

రాజధానిపై తుది నిర్ణయం తీసుకోవడానికి కమిటీ వేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పారు.

ఆ కమిటీ మరో వారం, పది రోజుల్లో సుదీర్ఘ నివేదిక ఇస్తుందనీ ఆయనే వెల్లడించారు.

కానీ అదే సమయంలో కమిటీ సూచనలు ఏంటో తెలియక ముందే ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని సూత్రప్రాయంగా ప్రకటించారు.

"""/"/ఆయనే తుది నిర్ణయం తీసుకుంటే ఇక కమిటీ ఎందుకన్న విమర్శలను జగన్‌ ఎలాగూ పట్టించుకోరు.

అది వేరే సంగతి.అయితే అసెంబ్లీలో జగన్ ఇప్పుడు ప్రకటించారుగానీ.

క్షేత్ర స్థాయిలో పని ఎప్పుడో ప్రారంభమైనట్లు తాజాగా ఓ వాట్సాప్‌ పోస్ట్‌ సంచలన విషయాన్ని వెల్లడిస్తోంది.

అంతేకాదు వైసీపీలోని అత్యంత ముఖ్యమైన నలుగురైదుగురికి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదని సమాచారం.

వైరల్‌గా మారిన ఆ వాట్సాప్‌ పోస్ట్‌ ప్రకారం జగన్‌ ప్రకటించినట్లుగా విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది.

దీనికోసం తగిన స్థలం, భవనాల సేకరణ కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది.రెండు వేల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కూడా గుర్తించారు.

అంతేకాదు ఈ మధ్యే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఖాళీ చేసిన రెండున్నర లక్షల చదరపు అడుగుల స్థలమున్న భవనాన్ని తాత్కాలికంగా పరిపాలన విభాగం కోసం వాడనున్నారు.

"""/"/ఈ భవనం విజయవాడకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారిది.ఇక ఆంధ్రా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న మరికొన్ని భవనాలను కూడా దీనికోసం గుర్తించారు.

భీమిలి దగ్గర్లో సముద్ర తీరాన మూడు ఎకరాల స్థలంలో ఉన్న ఓ భవనం ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

కార్యనిర్వాహక వర్గాన్ని గరిష్ఠంగా మరో మూడు, నాలుగు నెలల్లో వైజాగ్‌కు తరలించే అవకాశం ఉందని ఆ వాట్సాప్‌ సందేశం స్పష్టం చేస్తోంది.

గవర్నర్‌ నివాసం కోసం శాశ్వత భవనం ఏర్పాటు చేసే వరకూ తాత్కాలికంగా సిరిపురంలోని సర్క్యూట్‌ హౌజ్‌ను రాజ్‌భవన్‌గా వాడనున్నారు.

ఈ పని ఎప్పటి నుంచో ప్రారంభమైనా ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచారు.వైసీపీలోని చాలా కొద్ది మంది ముఖ్యులు మాత్రమే ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

హ‌లో అబ్బాయిలు.. ద‌ట్ట‌మైన గ‌డ్డాన్ని కోరుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకే!