జ్యోతిష్యుడిని నమ్మి లాటరీ కొన్న యూఎస్ మహిళ.. కట్ చేస్తే రూ.4కోట్లు గెలిచింది..

ఒక్కోసారి మూఢనమ్మకాలు నమ్మటమే మంచిదవుతుంది.దీనివల్ల అనుకోని అదృష్టాలు పలకరిస్తుంటాయి.

తాజాగా అమెరికాలోని జెనెసీ కౌంటీకి( Genesee County, USA ) చెందిన 59 ఏళ్ల ఒక మహిళ కూడా ఒక నమ్మకం పై పూర్తిగా ఆధారపడుతూ చివరికి ఊహించని అదృష్టాన్ని పొందింది.

ఒకరోజు ఆమె టారో కార్డ్ రీడింగ్‌కి( Tarot Card Reading ) వెళ్ళింది.

ఆ రీడింగ్ ఆధారంగా సాధారణంగా కొనని లాటరీ టిక్కెట్లు కూడా కొనుగోలు చేసింది.

ఆమె సాధారణంగా ఒకే స్టోర్‌లో టిక్కెట్లు కొంటుంది, కానీ ఆ రోజు మాత్రం టారో రీడింగ్‌కి వెళ్లే దారిలో ఒక BP గ్యాస్ స్టేషన్‌లో ఆగి టిక్కెట్లు కొంది.

టారో రీడర్ లేదా జ్యోతిష్యుడు ఆమెకు ఒక అద్భుతమైన భవిష్యత్తును అంచనా వేశారు.

అదే రోజు కొనుగోలు చేసిన టిక్కెట్‌లో ఆమెకు భారీ లాటరీ మనీ గెలిచింది! ఈ సంఘటన ఆమెను ఆశ్చర్యపరిచింది ఎందుకంటే టారో రీడింగ్‌లో చెప్పినట్లుగానే జరిగింది.

ఈ సంఘటన వల్ల ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది.టారో కార్డ్ రీడింగ్‌ల పట్ల ఆమెకు నమ్మకం పెరిగింది.

"""/" / టారో రీడింగ్ సమయంలో, ఆమెకు త్వరలోనే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని రీడర్ చెప్పారు.

అయితే, ఆమె ఆ క్షణంలో కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ ద్వారా డబ్బు వస్తుందని అసలు ఊహించలేదు.

ఆమె టిక్కెట్లను గీకడం ప్రారంభించినప్పుడు, ఒక టిక్కెట్‌పై నక్షత్ర చిహ్నం( Star Symbol ) చూసి చిన్న మొత్తం గెలిచిందని ఆమె అనుకుంది.

కానీ, ఆశ్చర్యకరంగా, ఆమె 500,000 డాలర్ల (రూ.4 కోట్లు) మనీ గెలిచింది.

"""/" / తన పేరును చెప్పడానికి ఇష్టపడని ఈ 59 ఏళ్ల మహిళ ఎప్పుడూ లాటరీ గెలుస్తానని నమ్ముతూ ఉండేది, ఈ విషయాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా పంచుకునేది.

ఈ డబ్బుతో ఆమె తన కారు రుణాన్ని చెల్లించాలని, తన స్నేహితురాలితో కలిసి ఒక క్రూయిజ్‌కి వెళ్లాలని, మిగతా డబ్బును పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది.

టారో కార్డ్‌లు చెప్పినట్లుగానే జరిగిన ఈ అదృష్టం ఆమెకు తన కలలను నెరవేర్చుకోవడానికి, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడుతుంది.

మావిటిని కాలితో తొక్కిన చంపేసిన ఏనుగు.. డిస్టర్బింగ్ వీడియో వైరల్..