రంగారెడ్డి జిల్లా నార్సింగి దాడి ఘటనలో ట్విస్ట్..!
TeluguStop.com
రంగారెడ్డి జిల్లా నార్సింగి దాడి ఘటనలో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది.ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో కీలక విషయాలు బయటపడ్డాయి.కరణ్ సింగ్ గ్యాంగ్ హిజ్రాలను లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో హిజ్రాలను కాపాడటానికి వచ్చిన కిశోర్ కుమార్ రెడ్డి, అతని స్నేహితునిపై కరణ్ సింగ్ గ్యాంగ్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.
ఈ దాడిలో కిశోర్ కుమార్ రెడ్డి ఘటనా స్థలంలోనే చనిపోగా ఆయన స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
అనంతరం కేసు విచారణకు వెళ్లిన ఎస్ఓటీ కానిస్టేబుళ్లపై కరణ్ సింగ్ గ్యాంగ్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
రాజమౌళి మహేష్ సినిమాపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు…. సినిమా వచ్చేది అప్పుడే అంటూ