హైదరాబాద్ అమ్నేషియా పబ్ కేసులో కీలక మలుపు

హైదరాబాద్ అమ్నేషియా పబ్ రేప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.కేసులో నిందితుడిగా ఉన్న వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని మైనర్ గా పరిగణిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జువైనల్ కోర్టులో మేజర్ గా పరిగణిస్తూ గతంలో ఆదేశాలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జువైనల్ కోర్టు ఆదేశాలపై వక్ఫ్ బోర్డు ఛైర్మన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గ్యాంగ్ రేప్ కేసులో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని మైనర్ గానే పరిగణించాలని ఆదేశాలు ఇచ్చింది.

అదేవిధంగా ఫోక్సో చట్టం కింద విచారణ జరపాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

చెక్‌బౌన్స్‌ కేసులో రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష