గిరిజన మహిళపై పలుమార్లు బలవంతపు అత్యాచారం..!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ పట్టణంలోని ఒక గిరిజన మహిళపై అశోక్ నగర్ కు చెందిన తల్లం శివప్రసాద్ @శివ గత కొద్ది నెలలుగా బలవంతంగా అత్యాచారానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.తల్లం శివప్రసాద్ ఓ గిరిజన మహిళను భయపెట్టి బలవంతంగా లోబర్చుకున్నాడు.
ఆ సమయంలో తీసి ఎవరికైనా చెబితే ఫోటోలు భర్తతో పాటు ఇంకెవరికైనా పంపిస్తానని బెదిరిస్తూ మళ్ళీ మళ్ళీ అత్యాచారానికి పాల్పడుతూ వేధించసాగాడు.
అతని
వేధింపులు భరించలేని సదరు మహిళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకముందే పెద్దలకు తెలియజేసింది.
పెద్దల సమక్షంలో మాట్లాడుతున్న సమయంలో నిందితుడు ఆమెపై చెయ్యి చేసుకొని,కులం పేరుతో దూషిస్తూ అవమానపరిచాడు.
దీంతో బాధితురాలు మిర్యాలగూడ టూ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ పి.
నాగరాజు సోమవారం మిర్యాలగూడకు చెందిన సరికొండ రిషికేశ్వర్ రాజు,తల్లం శివప్రసాద్@శివపై కేసు నమోదు చేసి,తల్లం శివప్రసాద్ ను అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు.
స్పెషల్ ట్రిక్‌తో ఫిమేల్ ఐఏఎస్ ఆఫీసర్లను ప్రేమలో పడేసిన యువకుడు.. లాస్ట్ ట్విస్ట్..?