పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది దుర్మరణం
TeluguStop.com
పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.కరాచీ నుంచి అబోటాబాద్ వెళ్తున్న హజరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిందని తెలుస్తోంది.
నవాబ్ షా ప్రాంతంలోని సర్హారీ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంతో 20 మంది మృతి చెందగా 80 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం.
ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించారు.ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో సింధ్ ప్రాంతంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
మూడో దశ ‘సర్’ షురూ…!