ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం..!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మధురా జిల్లాలోని యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై డబుల్ డెక్కర్ బస్సు బోల్తా పడింది.

ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా 36 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో వెంటనే క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించడం జరిగింది.కాగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 100 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ఈ బస్సు బీహార్ నుండి ఢిల్లీ వెల్తుండగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదం జరగడానికి గల కారణం బస్సు ఓవర్ స్పీడ్ గా నడపడమే అని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అంటున్నారు.

అతివేగంతో నడపడంతో బస్సు అదుపులోకి రాక బ్రేక్ కొట్టిన టైంలో రెండు పిల్టిలు కొట్టింది.

బస్సులో దాదాపు వందమంది ప్రయాణిస్తుండగా.ఒకరు మృతి చెందగా 36 మందికి తీవ్ర గాయాలు అవ్వడం జరిగింది.

వీడియో: కుంభమేళాలో తన్నుల స్వామి లీలలు.. కాలి తాకిడితో రోగాలు మాయమట..?