దక్షిణాఫ్రికా రాజధాని జొహెన్స్బర్గ్లో ఘోర అగ్నిప్రమాదం.. 52 మంది సజీవదహనం
TeluguStop.com
దక్షిణాఫ్రికా రాజధాని జొహెన్స్బర్గ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో 52 మంది సజీవదహనం అయ్యారు.
మరో యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.ఐదంతుస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు భారీగా ఎగసిపడటంతో పాటు భవనంలో దట్టమైన పొగ అలుముకుంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
భవనంలో మరి కొంతమంది చిక్కుకుని ఉన్నారని భావిస్తున్న పోలీసులు, అధికారులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అమెరికా: భారతీయుల జీవితాలు అల్లకల్లోలం.. వీసాల గందరగోళంతో ఆందోళన.. అసలేం జరుగుతోంది?