మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది సజీవదహనం

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది.నాసిక్ లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.

దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు.పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.