ప్రచారానికి తాత్కాలిక విరామం ! భారీ ప్లానే వేస్తోన్న కేసీఆర్ 

మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ అధినేత, ( BRS ) తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీడ్ పెంచారు.

గత కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేపడుతూ అనేక సభల్లో పాల్గొంటున్నారు .

కేసీఆర్ ( CM Kcr )తో పాటు , మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు వంటి వారు రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పై చేయి సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

కెసిఆర్ సభలకు ఆయన ప్రసంగాలకు జనాల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.ఎన్నికల ప్రచారం ముగిసే వరకు ఇదే విధంగా స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నారు.

ఇక ఈనెల 10 ,11, 12 తేదీల్లో ఎన్నికల ప్రచార సభలకు కేసీఆర్ విరామం ఇచ్చారు.

ఈనెల 12వ తేదీన దీపావళి పండుగ ఉండడంతో సభలు నిర్వహించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

13 నుంచి ఈ నెల 28 వరకు 54 సభల్లో కేసీఆర్ పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నారు .

"""/" / ఈ మూడు రోజుల విరామ సమయంలో ఇప్పటివరకు సాగిన ఎన్నికల ప్రచార శైలి, సభలు , నామినేషన్ల ప్రక్రియపై కేసీఆర్ ( CM Kcr )సమీక్షించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి .

ముఖ్యంగా కేసీఆర్,  హరీష్ రావుతో నియోజకవర్గాల వారీగా రివ్యూలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఈ సభలతో ఏ మేరకు ప్రజల్లో బీ ఆర్ ఎస్ కు ఆదరణ పెరిగింది ? మేనిఫెస్టోను ఏ మేరకు ప్రచారం చేశారు ?  ప్రజల్లో దానిపై ఎటువంటి స్పందన వచ్చింది , ఇంకా ఏ ప్రణాళికలతో ముందుకు వెళ్లి ప్రజలను ఆకట్టుకోవాలనే విషయాల పైన చర్చించనున్నట్టు సమాచారం.

  దీనికి తోడు ఇంటిలిజెన్స్, సర్వే సంస్థల రిపోర్టులు, పార్టీ వర్గాల  నుంచి వచ్చిన సమాచారం పైన కెసిఆర్ సమీక్షించనున్నారట.

  ఎన్నికల వరకు నేతలు వ్యవహార శైలి,  ఎన్నికల ప్రచార తీరు వంటి వాటిపై సమీక్షించనున్నట్టు సమాచారం .

ఆశించిన స్థాయిలో ప్రజల్లో ఆదరణ రాని నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా దృష్టి సారించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారట.

ఇక తాను పోటీ చేస్తున్న కామారెడ్డి,  గజ్వేల్ నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా కేసీఆర్ సమీక్షించనున్నారట.

ముఖ్యంగా ఈ రెండు నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ అసంతృప్తి నేతలను గుర్తించడం , గ్రూపు రాజకీయాలకు పాల్పడుతున్న వారిని బుజ్జగించడం వంటి విషయాలపైనా ఫోకస్ చేయనున్నారు.

"""/" / కేసీఆర్ >( CM Kcr )ను గెలిపిస్తే నియోజకవర్గానికి భారీగా నిధులు వస్తాయి అని , ఊహించిన స్థాయిలో అభివృద్ధి జరుగుతుందని , ఇంటింటికి ప్రచారం చేసే విధంగా నాయకులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయబోతున్నారాట.

నియోజకవర్గాలకు మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు తో పాటు మరికొంతమంది కీలక నేతలను పంపించి , అక్కడ బీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులు ఏర్పడే విధంగా భారీగా హామీలు ప్రజల్లో కి వెళ్ళే విధంగా కెసిఆర్ దృష్టి సారించనున్నారట.

  మొత్తం ఈ మూడు రోజుల్లో చాలా కీలక నిర్ణయాలే తీసుకుని అమలు చేసేందుకు కేసీఆర్ వ్యూహరచన చేయనున్నారట.