మేడిగడ్డకు నిపుణుల బృందం.. బ్యారేజ్ గేట్ల ఎత్తివేతకు ఏర్పాట్లు
TeluguStop.com
జయశంకర్ భూపాలపల్లి జిల్లా( Bhupalpally )లోని మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) ను సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం సందర్శించింది.
ఈ క్రమంలో బ్యారేజ్ మరమ్మత్తుల పనుల గురించి నిపుణుల బృందం కీలక సూచనలు ఇవ్వనుంది.
మేడిగడ్డ బ్యారేజ్ లో డ్యామేజ్ అయిన 17, 18వ గేట్లను నిపుణులు ఎత్తనున్నారు.
దీంతో నిపుణుల సమక్షంలో గేట్లను ఎత్తేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ మేరకు సిల్ బీమ్స్, వాల్ ప్లేట్లతో పాటు గర్డర్ లను సిబ్బంది క్లీన్ చేశారు.
అదేవిధంగా వరదలకు అడ్డంకి లేకుండా ఉండేందుకు గేట్లను ఎత్తాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు( Dam Safety Officers) కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో మొత్తం గేట్లను నిర్మాణ సంస్థ ఎత్తనుంది.
కొరటాల శివ ఆ స్టార్ హీరో తో సినిమా చేస్తున్నాడా..?