ఒకపూట నాటు కూలీగా మారిన తహశీల్దార్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:సాధారణంగా ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు రకరకాల పనులు చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులివ్వడం అందరికీ తెలిసిందే.
కానీ,అధికారులు అలాంటి వాటికి దూరంగానే ఉంటారు.సోమవారం ఓ మహిళా తహసీల్దార్ మాత్రం తమ విధులు నిర్వహిస్తూనే ఒకపూట మహిళలతో కలిసి వ్యవసాయ పొలంలో
నాటేయడం మహిళా కూలీలను,స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
సూర్యాపేట జిల్లా
హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకవీడు తాహసిల్దార్ గా పనిచేస్తున్న వల్లే శ్రీదేవి తమ విధులు నిర్వహిస్తూనే మహిళలతో కలిసి ఒకపూట వరినాట్లు వేసి,వారి బాధలు తెలుసుకొన్నారు.
నాటేయడం అంటే సాదాసీదా విషయం కాదని,అది చాలా కష్టమైన ప్రక్రియ అని,అది కేవలం మహిళలకే సాధ్యమని తహసీల్దార్ శ్రీదేవి పేర్కొన్నారు.
పెట్టుబడి రూ.2 కోట్లు.. కలెక్షన్లు రూ.18 కోట్లు.. ఎన్టీఆర్ కు సొంతమైన రికార్డ్ ఇదే!