సెల్ఫీలతో ఓ స్టూడెంట్ కోటీశ్వరుడయ్యాడు.. 11 రోజుల్లో ఎంత సంపాదించాడో తెలుసా..

మొబైల్ ఫోన్ చూస్తూ అందరికీ ముందుగా గుర్తొచ్చేది సెల్ఫీలే.ప్రస్తుతం చాలా మంది చిన్నా పెద్ద, ఆడ మగ అనే తేడాల లేకుండా సెల్ఫీలు దిగుతున్నారు.

ముఖ్యంగా చాలా మంది మొబైల్ ఫోన్ కొనే సమయంలో మిగతా ఫిచర్స్ ను పక్కన పెట్టి కేవలం కేవలం కెమెరా క్వాలిటీపైనే స్పెషల్‌గా ఫోకస్ చేస్తున్నారు.

ఇక టైం దొరికినప్పుడల్లా సెల్ఫీలు కొడుతూ ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు.ఇలా సెల్ఫీల సరదాతో ఓ స్టూడెంట్ లైఫ్ మారిపోయింది.

అంటే ఇరకాటంలో పడ్డాడు అనుకుంటే పొరపాటే.ఆయన సెల్ఫీల సరద అతన్ని కోటీశ్వరుడిని చేసింది.

ఇండోనేషియా దేశంలోని సెమరాంగ్‌ యూనివర్శిటీకి చెందిన ఓ కంప్యూటర్‌ సైన్స్‌ స్టూడెంట్ సుల్తాన్‌ గుస్తాఫ్‌ అల్‌ ఘోజాలి 22 ఏండ్ల యువకుడికి సెల్ఫీలు తీసుకునే అలవాటుంది.

కంప్యూటర్ ముందు కూర్చొని ప్రతి రోజూ సెల్ఫీలు తీసుకునేవాడు.ఇలా ఐదేళ్లుగా సెల్ఫీలు తీసుకుంటున్నాడు.

గ్రాడ్యుయేషన్‌ చదువుకునే టైంలో తనలో వచ్చిన చేంజస్ అంటూ ఓ టైమ్ లాప్స్ వీడియోను చేసేందుకు సిద్ధమయ్యాడు.

అదేటైంలో సుల్తాన్‌ గుస్తాఫ్‌ దృష్టి నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ వార్తలపైన పడింది.వెంటనే అతడు ఎన్‌ఎఫ్‌టీల కోసం వెబ్‌సైట్‌ ఖాతా తెరిచాడు.

"""/"/ (ఎన్‌ఎఫ్‌టీ అంటే పాటలు, ఫొటోలు, వీడియోలు, ట్వీట్లను డిజిటల్‌ రూపంలో అమ్మకం, కొనుగోలు చేసేందుకు యూజ్ చేసే ఓ ఆన్ లైన్ సాధనం) దీంతో సుల్తాన్ తనకు సంబంధించిన సెల్ఫీలను ఘొజాలి ఎవిరీడే పేరుతో 933 సెల్ఫీలను జనవరి 10న అమ్మకానికి ఉంచాడు.

ఒక్కో సెల్ఫీ ధరను 3 డాలర్లుగా నిర్ణయించాడు.సెల్ఫీని కొన్నట్లు ఓ సెలబ్రిటీ షెఫ్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు.

ఇంకేముంది.సుల్తాన్‌ గుస్తాఫ్‌‌కు సంబంధించిన సెల్ఫీలను 11 రోజుల్లోనే సుమారు 500 మందికిపైగా కొనుగోలు చేశాడు.

మన దేశ కరెన్సీ ప్రకారం దాదాపు వాటి విలువ దాదాపు రూ.7.

5 కోట్లు అన్నమాట.

నా ఒంటి రంగును చూసి నేనెప్పుడూ గర్వపడతాను : అర్చన