రెస్టారెంట్ టేబుల్ కింద వింత గుర్తు.. పరిశీలించి చూస్తే.. వెలుగులో నమ్మలేని నిజం

ఓ రెస్టారెంట్ లో భోజనానికి వెళ్లిన వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.తాన కూర్చున్న టేబుల్ కింద వింతు గుర్తులు కనబడ్డాయి.

దీంతో షాకైన ఆ వ్యక్తి ఆ గుర్తు ఎంటా అని ఆరాతీశాడు.ఆ గుర్తులు విచిత్రంగా కనిపించడంతో వెంటనే ఈ విషయాన్ని పురావస్తు శాఖ అధికారులకు తెలియజేశాడు.

వారు వచ్చి దానిని పరిశీలించగా.అవి డౌనోసార్ పాద ముద్రలే అని నిర్ధారించారు.

ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో ఉన్న లెషాన్ లోని ఓ రెస్టారెంట్ కి ఔ హాంగ్ టో అనే వ్యక్తి వెళ్లాడు.

అతడు కూర్చున్న టేబుల్ కింద గుంతులుగా ఉంది.ఆ గుంతలను పరిశీలించి చూడగా అవి వింత ఆకారంలో కనిపించాయి.

దీంతో ఈ విషయాన్ని ఆ వ్యక్తి పరిశోధకలకు తెలిపాడు.దీంతో చైనా యూనివర్సిటీ ఆఫ్ జియోసైన్సెస్ లోని పాలియోంటాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లిడా జింగ్ నేతృత్వంలోని నిపుణుల టీమ్ ఈ ప్రదేశాన్ని పరిశీలించింది.

ఇవి 100 మిలియన్ సంవత్సరాల నాటి డైనోసార్ పాదముద్రలు అని ఈ టీమ్ తేల్చింది.

ఈ పాదముద్రలు రెండు జాతుల సౌరోపాడ్ లకు చెందినవని, ముఖ్యంగా బ్రోంటోసారస్ ల గుర్తులని నిర్ధారించారు.

ఈ డౌనోసార్లు 145 నుంచి 66 మిలియన్ ఏళ్ల క్రితం క్రీటేషియస్ కాలంలో భూమిపై తిరిగినట్లు పరిశోధకులు అంచనా వేశారు.

ఈ డైనోసార్లు భూమిపై నివసించిన అతిపెద్ద జంతువులుగా తేల్చారు.అవి 122 అడుగుల పొడవు, 70 టన్నుల బరువు కలిగి ఉన్నట్లు అంచనా వేశారు.

ఈ పాద ముద్రలు చాలా లోతుగా, స్పష్టంగా ఉన్నాయని, వాటి చుట్టూ కంచెను ఏర్పాటు చేశామని నిపుణులు పేర్కొన్నారు.

నగరాల్లోని నిర్మాణాల వల్ల ఇలాంటి అరుదైన శిలాజాలను అధ్యయనం చేయడం కష్టతరం అయ్యిందని పరిశోధకులు చెప్పారు.

ప్రభాస్ ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..?