ఇదేంటబ్బ: బీచ్ లో కనిపించిన వింత జీవి..!

మన ఈ భూ ప్రపంచంలో మనకు తెలియని అద్భుతమైన జీవులు చాలానే ఉన్నాయి.

కొన్ని అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి.కొన్ని మాత్రం అంతరించుపోతూ ఉంటాయి.

అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో మనకు తెలియని జీవుల గురించి కూడా మనకు తెలిసేలాగా వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు.

అవి చూసిన మనకు ఈ భూ ప్రపంచంలో అసలు ఇలాంటి జీవి అనేది ఒకటి ఉంటుందా అనే అనుమానం మనకు కలుగుతుంది కదా.

కొన్ని కొన్ని జీవులు చూడడానికి భలే ఆశ్చర్యకరంగా ఉంటాయి.ముఖ్యంగా సముద్రంలో మనుగడ సాధించే జీవులు గురించి అయితే చెప్పనవసరం లేదు.

ఎందుకంటే సముద్రంలో రకరకాల జీవులు నివసిస్తాయి.వాటిలో మనకు కొన్ని తెలిస్తే మరికొన్ని జీవులను మాత్రం అసలు మనం చూసి ఉండము.

నిజం చెప్పాలంటే వాటి పేరు కూడా మనకి సరిగా తెలియదు.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక వింత జీవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.

ఆ జీవి పేరు ఏంటో తెలియక అందరు జుట్లు పీక్కొంటున్నారు.ఇంతకీ ఈ ప్రాణి ఎక్కడ కనిపించిందంటే ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్‌ లోని ఓ బీచ్ ఒడ్డుకు గోధుమ రంగులో ఉన్న ఈ ప్రాణి కొట్టుకొచ్చింది.

"""/"/ ఈ ప్రాణి గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారో చూద్దామా.యెప్పూన్‌ లోని కెంప్ బీచ్‌లోకి కొట్టుకొచ్చిన ఈ ప్రాణి చూడడానికి సీ టమాటో జెల్లీఫిష్, బ్లోబ్ ఫిష్‌ లా కనిపిస్తోంది.

అలాగే సొరచేప పెట్టిన గుడ్ల ముద్దలాగా కూడా కనిపిస్తుంది.దీని గురించి సముద్ర నిపుణుడు అయిన డాక్టర్ లిసా గెర్షివిన్ మాట్లాడుతూ.

దీనిని 'మేన్ సైనేయా బార్కేరి జెల్లీ ఫిష్' అని అంటారు అని చెప్పారు.

జెల్లీ ఫిష్ లలో ఇది ఒక అరుదైన జెల్లీ ఫిష్ జాతికి చెందిన జీవి అని తెలిపారు.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు సీపీఎం మద్ధతు.. సీఎం రేవంత్