కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావాలి.: కిషన్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శ్రీకోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు( Sri Krodhi Nama Samvatsara Ugadi Subhakankshalu ) తెలిపారు.

హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) మాట్లాడుతూ ఈ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

కేంద్రంలో ఈ సారి కూడా స్థిరమైన ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు.అన్ని వర్గాల ప్రజలు మోదీని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.

మోదీ పాలనతోనే దేశంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల దీక్ష .. పెరుగుతోన్న ప్రవాస భారతీయుల మద్ధతు