తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆధ్యాత్మిక దినోత్సవం!

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈరోజు శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు,ప్రజా ప్రతినిధులతో, పార్టీ నాయకులతో కలిసి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎం.ఎల్.

ఏ రమేష్ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీ.ఎం.

కేసీఆర్ ఆరోగ్యంగా వుండి రాష్ట్రానికి ఇంకా ఎన్నో సేవలు చేయాలని కొరుకున్నమన్నారు.

ఈ ఆధ్యాత్మిక దినోత్సవ సందర్భంలో అర్చకులకు ధూప దీప నైవేద్య ఆర్డర్ కాపీలను అందించడం చాలా సంతోషంగా ఉన్నదని అన్నారు.

ఇవి మంజూరీ చేసిన జిల్లా మంత్రి కేటీఆర్ కి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణా వచ్చాక సీఎం కేసీఅర్ అన్ని మతాల వారికి తగు ప్రాధాన్యత ఇస్తున్నారని, దూప దీప నైవేద్యం 6000 నుండి 10 వేలకు పెంచండం హర్షణీయం అన్నారు.

తెలంగాణా రాక ముందు దేవాలయాలు ఎలా వుండే నేడు ఎలా ఉన్నవో గమనించాలని అన్నారు.

మధ్య మానేరు నుండి 16కోట్లతో గుడిచెరువుకు లిఫ్ట్ వేసుకున్నామని 125కోట్లతో చుట్టూ రింగురోడ్డు వేసుకున్నామని పట్టణ వాసులకు, భక్తులకు అందరికీ ఉపయోగపడేలా చేసామని గుడికి సంబంధించిన 4ఎకరాలు తీసుకొని 100పడకల ఆసుపత్రి నిర్మించుకున్నామని ఇక్కడ గుడిచెరువు పక్కన 30ఎకరాలు దేవాలయానికి అప్పగించామని బద్ధిపోచమ్మ తల్లి దేవాలయానికి 18కోట్లతో 1ఎకరం స్థల సేకరణ చేసామని త్వరలోనే మంత్రి కేటీఆర్ బంగారం లాంటి బోనాల మండపం నిర్మాణానికి భూమిపూజ చేస్తారని అలాగే మనం శివర్చన చేసుకునే స్థలంలో శాశ్వత ప్రదర్శన వేదికను నిర్మించబోతున్నామని దానికి కూడా మంత్రి భూమిపూజ చేస్తారని అన్ని కార్యక్రమాలు కలిపితే 100కోట్లు పనులు ప్రారంభోత్సవాలు, భూమిపూజలు చేసుకోవడం జరుగుతుందని ఇది ప్రతిపక్షాలకు కనబడటం లేదని అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

అభివృద్ధి లో ఎవరూ నష్టపోకూడదనే ముఖ్య ఉదేశ్యంతో కొంత సమయం ఆలస్యం అయినా సరే వారితో చర్చించి వారిని ఒప్పించి అభివృద్ధి లో భాగస్వాములను చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్.పి వైస్ చైర్మన్ ఒద్దినేని హరి చరణ్ రావు , మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవి , జెడ్.

పి.టి.

సి మ్యాకల రవి, ఎం.పి.

పి చంద్రయ్య గౌడ్, కౌన్సిలర్లు యాచమనేని శ్రీనివాసరావు, బింగి మహేష్ , ఇప్పపూల అజయ్ , జోగిని శంకర్, మారం కుమార్ , సిరిగిరి చందు, పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు , మండల అధ్యక్షులు మాల్యాల దేవయ్య, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వైరల్ ఫొటోస్.. ఏంటి భయ్యా టీమిండియా స్టార్స్ అందరూ ఇలా సన్యాసం తీసుకున్నారు