పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము

విద్య నేర్పిన గురువుల కు ఘన సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా :25 ఏళ్ల క్రితం ఒక్క చోట చదివి పై చదువులకోసం విడిపోయి ఒక్కొకరు ఒక్కో స్థానం లో స్థిరపడి ఎక్కడ విడిపోయమో అక్కడే కలవాలని నిర్ణయించుకొని పూర్వం చదువుకున్న పాటశాల లోనే 25 ఏళ్ల తరువాత కలిశారు.

బోయినిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1998-99 పదవ తరగతి పూర్వ విద్యార్థులు 25వ సిల్వర్ జూబ్లీ వేడుకులను ఘనంగా జరుపుకొన్నారు.

ఈ సందర్భంగా తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించరు.ఆటపాటలతో ఆనందంగా గడిపారు .

పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకిరించుకున్నరు.25 ఏళ్ల తరువాత ఎక్కడా విడిపోయమో అక్కడే కలవడం ఆనందంగా ఉందని అన్నారు.

ఇందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు పి.భూమయ్య,ఉపాధ్యాయులు కే.

విజయసేనారెడ్డి, ఎన్.రాజేంద్రవర్మ, ఎం స్వామి, ఎం.

రాములు, పి ఈ టి లక్ష్మయ్య, ఎస్.రవీందర్, బిల్ల ఆనందం, జాకీర్,పాల్లొనగ వారిని ఘనంగా సన్మానించారు.

ఈ సమ్మేళనములో సుమారుగా 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

అమెరికాలో హై-టెక్ మోసం.. తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం..