లేడీస్ కోసం స్పెషల్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది… ‘ఫైర్ బోల్ట్ ప్రిస్టైన్’ వాచ్ ఇపుడు ఇండియన్ మార్కెట్లో!
TeluguStop.com
ఇపుడు స్మార్ట్‌వాచ్( Smart Watch ) అనేది స్మార్ట్ ఫోన్స్ కి గట్టి పోటీ ఇస్తోందని చెప్పుకోవాలి.
జనాలలో స్మార్ట్ ఫోన్ మానియా పోయి స్మార్ట్‌వాచ్ మానియా తయారైంది.చాలా బెనిఫిట్స్ ఉండడంతో సాధారణ వాచెస్ అలవాటు లేనివారు కూడా నేడు స్మార్ట్‌వాచ్ వైపు మొగ్గు చూపడం గమనార్హం.
ఇక మనదగ్గర కూడా, ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్స్ వాడడమే కాకుండా పెద్దవారికి కూడా వాడమని సలహాలు ఇస్తున్నారు.
దానికి కారణం అందరికీ తెల్సిందే.స్మార్ట్‌వాచ్ అనేది నేడు ఆరోగ్యం విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
"""/" /
ఇక డొమెస్టిక్ స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో కొన్ని ఇండియన్ వేరబుల్ బ్రాండ్స్ దూసుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు.
స్వదేశీ స్మార్ట్‌వాచ్ బ్రాండ్ అయిన ఫైర్-బోల్ట్,( Fire Bolt ) తాజాగా మహిళల కోసం స్పెషల్ స్మార్ట్‌వాచ్‌ను రూపొందించింది.
మహిళా వినియోగదారులను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో సరికొత్త ఫైర్-బోల్ట్ ప్రిస్టైన్ వాచ్‌ను( Fire Bolt Pristine ) లాంచ్ చేసింది.
ఇకపోతే ఫైర్ బోల్ట్ ప్రిస్టైన్ అనేది మహిళల కోసం కంపెనీ రూపొందించిన మొట్టమొదటి ఎడిషన్ స్మార్ట్‌వాచ్.
ఇది 1.32 అంగుళాల HD డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, స్పోర్ట్స్ మోడ్స్.
వంటి ఫీచర్లతో వస్తుంది. """/" /
ఫైర్-బోల్ట్ ప్రిస్టైన్ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే, ఫైర్-బోల్ట్ ప్రిస్టైన్ స్మార్ట్‌వాచ్‌లో 2 విభిన్న మెనూ డిజైన్స్ ఉంటాయి.
రిమోట్ కెమెరా కంట్రోల్, 210 MAh బ్యాటరీ, సెడెంటరీ రిమైండర్స్ వంటివి వాటిగురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి.
మెన్‌స్ట్రువల్ సైకిల్, హార్ట్ రేటు, స్లీప్ సైకిల్, SpO2 లెవల్ మానిటరింగ్ వంటి స్పెసిఫికేషన్లతో ఈ వాచ్ ఉమెన్ యూజర్లను ఆకర్షిస్తోంది.
360×360 పిక్సెల్స్ రిజల్యూషన్, 1.32 అంగుళాల HD డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, 60 స్పోర్ట్స్ మోడ్స్, రిమోట్ కెమెరా కంట్రోల్ వంటి ఫీచర్లు కలవు.
జనసేన వైపే వారందరి చూపు .. ఎందుకిలా ?