చెట్టెక్కిన వ్యక్తి కాళ్లను చుట్టేసిన పాము.. వీడియో వైరల్
TeluguStop.com
సోషల్ మీడియా( Social Media ) విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వీడియోలు మనకు దర్శనమిస్తున్నాయి.
అందులో కొన్ని భయపెడతాయి.మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి.
ఇంకొన్ని నవ్విస్తాయి.ముఖ్యంగా కొన్ని వీడియోలను చూసినప్పుడు ఖచ్చితంగా నవ్వు వస్తుంది.
ఇలా పొట్ట చెక్కలయ్యేలా నవ్వగలిగే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ఓ వ్యక్తి చెట్టెక్కి పనస పండ్లను కోస్తాడు.తనకు నచ్చిన పండ్లను చకచకా ఒక్కొక్కటి కోసి కింద పడేస్తుంటాడు.
చాలా సంతోషంగా కనిపిస్తాయి.ఇంతలో అతడికి అనుమానం వస్తుంది.
వెంటనే తన కాళ్ల వైపు చూసుకుంటాడు.అలా చూడగానే అతడికి గుండె ఆగినంత పనవుతుంది.
ఈ వీడియో చూడగానే అతడి ముఖం చూసి ఖచ్చితంగా మనకు నవ్వు వస్తుంది.
అయ్యో పాపం అని కూడా అనిపిస్తుంది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
"""/" /
పనస పండు( Jackfruit ) ఎన్నో పోషకాలకు మూలం.ముఖ్యంగా చాలా మంది తమ ఇళ్లలో, పొలాల్లో ఇటువంటి పనస చెట్లను పెంచుకుంటారు.
ఇలా దాని సీజన్ రాగానే చెట్టు మొత్తం పనస పండ్లతో నిండిపోతుంది.ఇలా పండిన లేదా కాపుకి వచ్చిన పండ్లను చాలా మంది కోస్తారు.
ఇదే కోవలో ఓ వ్యక్తి పనస చెట్టు ఉత్సాహంగా ఎక్కేశాడు.ఆ తర్వాత పనస పండ్లను కోస్తూ వచ్చాడు.
"""/" / ఇంతలో తన కాళ్ల వద్ద ఏదో ఉందని అతడికి అర్థం అయింది.
వెంటనే కిందికి చూడగానే అతడికి ఆందోళన మొదలైంది.కింద తన కాళ్ల వద్ద ఓ పాము ఉండడం ఆ వ్యక్తి చూశాడు.
ఆ పాము కూడా తన పనస పండ్లు అతడు కోసేస్తున్నాడనే కోపంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది.
వెంటనే అతడి కాళ్లను చుట్టేస్తుంది.ఇది చూసిన ఆ వ్యక్తికి చాలా ఆందోళన ప్రారంభం అవుతుంది.
మెల్లగా అతడు చెట్టు నుంచి కిందికి దిగేస్తాడు.అయితే దిగుతున్న సమయంలో అతడిని ఆ పాము ఏమీ చేయదు.
దీని సంబంధించిన వీడియోను @rk__rofiq__official___04 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది.
వివేక్ రామస్వామి పదవిపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన