కోతి చేతికి స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!

కోతికి కొబ్బరి చిప్ప దొరికితేనే నానా హంగామా చేస్తుంది.ఎగురుతూ, గెంతుతూ దానిని విసిరేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.

అలాంటి దానికి ఫోన్ దొరికితే ఇక భూమ్మీద ఆగుతుందా.అయితే ఒక వ్యక్తి నిజంగానే కోతి మూకకు స్మార్ట్‌ఫోన్ ఇచ్చాడు.

అంతే అవి దానికి అతుక్కుపోయి అందులో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ ఒకింత విస్మయానికి గురి అయ్యాయి.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన స్మార్ట్‌ఫోన్‌ను కోతుల చేతికి అందించడం గమనించవచ్చు.

అందులో కోతి ఫొటోలు కనిపించడంతో నిజమైన కోతులు నివ్వెరపోయాయి.'ఏంటీ, చోద్యం.

ఇంత చిన్న పరికరంలోకి అంత పెద్ద కోతులు ఎలా వెళ్లిపోయాయి??' అన్నట్లు అవి ఆశ్చర్యంతో స్టన్ అయిపోయాయి.

వీడియోలు చూస్తూ ఔరా, ఏమి ఈ మానవుడు సృష్టి అన్నట్లు ఆ కోతులు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాయి.

ఒక పెద్ద కోతి కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనిపించే ఫొటోలు, వీడియోలు చూసి అబ్బురపడింది.

ఆ తర్వాత ఈ కోతులు ఆ ఫోన్ స్క్రీన్ పై ప్రెస్ చేస్తూ అందులో కనిపించే బొమ్మలు చూస్తూ ఉండి పోయాయి.

ఓనర్‌కి మాత్రం ఫోన్ ఇచ్చేందుకు అవి నిరాకరించినట్లు కనిపిస్తోంది.ఈ వీడియోని క్వీన్ ఆఫ్ హిమాచల్ అనే ట్విటర్ యూజర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

"సోషల్ మీడియా క్రేజ్ చూడండి, కోతులు కూడా వాటికి అలవాటు పడ్డాయి", కర్మ రా బాబు అన్నట్టు ఆమె కామెంట్ పెట్టారు.

ఈ వండర్‌ఫుల్ వీడియోకి ఇప్పటికే ఒక లక్షా ఎనభై వేల వరకు వ్యూస్ వచ్చాయి.

దీన్ని చూసిన నెటిజన్లు ఇది చాలా ఫన్నీగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.పాపం ఆ వ్యక్తి ఆ ఫోన్‌ను ఎలా తీసుకున్నాడు ఏమో అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

మీరు కూడా దీనిపై ఓ లుక్కేయండి.

ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో ఎన్టీయార్ మార్కెట్ ను పెంచుతాడా..?