‘జైలర్’ మేకింగ్ వీడియో.. అదిరిపోయే లుక్ లో సూపర్ స్టార్!
TeluguStop.com
కోలీవుడ్ స్టార్ హీరోల్లో రజనీ కాంత్ ఒకరు.రజనీ కాంత్ కు తమిళ్ లో మాత్రమే కాదు.
ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది.ఈయన ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఈయన సినిమాలు అంటే ఇప్పటికి అదే క్రేజ్ ఉంటుంది.మరి రజనీ కాంత్ ఇంట్రెస్టింగ్ లైనప్ ను లైన్లో పెట్టుకున్నాడు.
ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.
ప్రెసెంట్ రజనీ కాంత్ 'జైలర్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఇటీవలే ఈ సినిమా నుండి పోస్టర్ రివీల్ చేసారు మేకర్స్.
ఈ మాస్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ తెచ్చుకుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది.
ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి మేకర్స్ చిన్న మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు.
సోషల్ మీడియా వేదికగా ఈ వీడియో కొద్దీ సేపటి క్రితం రిలీజ్ అవ్వగా వెంటనే వైరల్ అయ్యింది.
ఈ మేకింగ్ వీడియోలో రజనీకాంత్ అదిరిపోయే లుక్ లో కనిపించదు.దీంతో జైలర్ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ మరింత ఆసక్తి పెంచుకుంటున్నారు.
"""/"/
ఇక ఈ సినిమాలో తమన్నా, రమ్య కృష్ణ కూడా నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు.
ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా.భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా 2023లో వేసవి కానుకగా రిలీజ్ కానుంది.చూడాలి ఈ సినిమాతో రజనీ కాంత్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
పాతిక లక్షల సహాయం అబద్దం.. కాంగ్రెస్ రెబల్ లీడర్ సంచలన వ్యాఖ్యలు వైరల్!