ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే నెల రోజుల్లో పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ మాయమవుతాయి!
TeluguStop.com
సాధారణంగా ప్రెగ్నెన్సీ( Pregnancy ) అనంతరం దాదాపు ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్య స్ట్రెచ్ మార్క్స్.
ప్రెగ్నెన్సీ టైంలో బేబీ కారణంగా పొట్ట బాగా సాగుతుంది.దీంతో ప్రసవం అనంతరం పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి.
ఇవి చాలా అసౌకర్యానికి గురి చేస్తాయి.పొట్ట వద్ద చర్మాన్ని అందవిహీనంగా మారుస్తాయి.
ఈ క్రమంలోనే పొట్టపై ఏర్పడ్డ స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోవడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు.
మార్కెట్లో లభ్యమయ్యే స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్స్, సీరమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.
"""/" /
అయితే వాటి వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కా తో కేవలం నెల రోజుల్లోనే పొట్టపై ఏర్పడిన స్ట్రెచ్ మార్క్స్ ను మాయం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ సింపుల్ చిట్కా ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్( Olive Oil ), రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి.
"""/" /
అలాగే చిటికెడు కుంకుమ పువ్వు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బౌల్ ను మరుగుతున్న నీటిలో రెండు నిమిషాల పాటు ఉంచి హీట్ చేయాలి.
ఇలా హీట్ చేసిన మిశ్రమాన్ని గోరువెచ్చగా అయిన తర్వాత పొట్ట పై అప్లై చేసి సున్నితంగా వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు ఈ విధంగా పొట్టకు అప్లై చేసుకుని పడుకోవాలి.ఉదయాన్నే గోరువెచ్చని నీటితో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, కుంకుమపువ్వు మరియు పసుపులో ఉండే పలు సుగుణాలు స్ట్రెచ్ మార్క్స్( Stretch Marks ) ను చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.
పొట్ట వద్ద సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తాయి.కాబట్టి ఎవరైతే స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో వారు తప్పకుండా పైన చెప్పిన సింపుల్ చిట్కాను పాటించండి.
ఇంట్లోనే సులభంగా మరియు వేగంగా స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోండి.