హెయిర్ ఫాల్ ను నివారించి జుట్టును స్మూత్ గా మార్చే సింపుల్ రెమెడీ మీకోసం!

హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు.వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, ధూమపానం, మద్యపానం, రెగ్యుల‌ర్ గా హెయిర్ వాష్ చేసుకోవ‌డం, వేడి వేడి నీటితో త‌ల‌స్నానం చేయ‌డం తదితర కారణాల వల్ల ఈ సమస్యల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

ఏదేమైన‌ప్పటికీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ప‌వ‌ర్ ఫుల్‌ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ ఫాల్( Hair Fall ) సమస్య దూరం అవ్వడమే కాదు డ్రై గా మారిన మీ జుట్టు స్మూత్ గా సైతం మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ అండ్ ప‌వ‌ర్ ఫుల్‌ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక కలబంద ఆకు( Aloe Vera Leaf ) తీసుకుని వాటర్ తో కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కలబంద జెల్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ కలబంద జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ), రెండు టేబుల్ స్పూన్లు ఆముదం( Castor Oil ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

"""/" / గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారానికి రెండు సార్లు కనుక చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గు ముఖం ప‌డుతుంది.

అలాగే పొడిబారిన‌ కురులు స్మూత్ గా మారతాయి.అదే స‌మ‌యంలో చుండ్రు( Dandruff ) సమస్య ఉంటే దూరం అవుతుంది.

చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.మరియు కాఫీ పౌడ‌ర్ లో ఉండే కెఫిన్ తెల్ల జుట్టు త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.

కాబట్టి ఎవరైతే హెయిర్ ఫాల్, డ్రై హెయిర్ సమస్యలతో సతమతం అవుతున్నారో వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.

సెకండ్ ఇన్నింగ్స్ లో తరుణ్ ఎంత వరకు సక్సెస్ అవుతాడు..?