వింటర్ లో ముఖాన్ని హైడ్రేటెడ్ గా మరియు గ్లోయింగ్ గా మార్చే సింపుల్ ప్యాక్ మీకోసం!

ప్రస్తుతం వింటర్ సీజన్ రన్ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో వివిధ రకాల చర్మ సమస్యలు చుట్టు ముట్టి తీవ్రంగా మదన పెడుతుంటాయి.

ముఖ్యంగా చర్మం తరచూ పొడిగా మరియు నిర్జీవంగా మారిపోతుంటుంది.ఇలా మీకు జరుగుతుందా.

? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఫేస్ ప్యాక్ ను ట్రై చేస్తే మీ ముఖ చర్మం హైడ్రేటెడ్ గా మరియు గ్లోయింగ్‌గా మెరుస్తూ కనిపించడం ఖాయం.

మరి ఇంతకీ ఆ ఫేస్ ప్యాక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

? వంటి విషయాలను ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం, వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు, నాలుగు బాదం పప్పులు వేసుకుని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ పాల మీగ‌డ‌, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా సరిపడా ఫ్రెష్ కొబ్బరి పాలు పోసి లూజ్ స్ట్రక్చర్ లో కలుపుకోవాలి.

"""/"/ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ ను ట్రై చేయడం వల్ల పొడిబారిన చర్మం హైడ్రేటెడ్ గా మారుతుంది.

చర్మం పై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.ముఖ చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

కాబట్టి ప్రస్తుత ఈ వింటర్ సీజన్‌లో చ‌ర్మం హైడ్రేటెడ్‌గా మ‌రియు గ్లోయింగ్‌గా మెర‌వాలంటే తప్పకుండా ఈ సింపుల్ ఫేస్ ప్యాక్‌ను ట్రై చేయండి.

చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిహారిక.. ఆ సినిమా ఏంటో తెలుసా?