రోడ్డుపై నడుస్తూ లోతైన నీటి గుంతలో పడిన యువతి.. షాకింగ్ వీడియో వైరల్..

గత కొద్ది రోజులుగా ఇండోర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ వర్షాలతో పాటు, నగరపాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయి.

ఫలితంగా చాలా మంది ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.కొందరు ప్రమాదంలో కూడా పడుతున్నారు.

తాజాగా ఇలాంటి ఓ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"""/" / అమ్మర్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక సీసీటీవీ కెమెరా ఈ వీడియోను రికార్డ్ చేసింది.

ఇందులో ఒక స్కూల్ గర్ల్ రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు 4 అడుగుల లోతున్న నీటి గుంతలో పడిపోయినట్టు మనం చూడవచ్చు.

ఆమె గుంతను నీటి మడుగుగా పొరపాటుగా భావించి, అడుగు పెట్టగానే మునిగిపోయింది.అదృష్టం కొద్దీ, ఆమె స్వయంగా లేచి, గుంత అంచుకు చేరుకుంది.

చివరికి, ఆమె వయస్సున్న ఒక బాలుడు ఆమెను రక్షించాడు.ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు నగరపాలక సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డు మరమ్మతులు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. """/" / ఈ ఘటన జూన్ 29న అమ్మర్ నగర్‌లోని వార్డ్‌ నెంబర్ 1లో చోటుచేసుకుంది.

అక్కడ నిర్మాణ పనుల కోసం మున్సిపల్ అధికారులు గుంత తవ్వారు.కానీ, ఆ గుంతను వారు మూసివేయలేదు.

దాంతో వర్షాలకు అది నీటితో నిండిపోయింది.ఒకవేళ ఆ గుంత ఇంకొంచెం పెద్దదై ఉంటే సదరు యువతీ అందులో మునిగిపోయి చనిపోయి ఉండేది.

ఈ ఘటనకు సంబంధించి చందన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, తనకు ఈ విషయం తెలియదని ఆ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఇంద్రమణి పటేల్ తెలిపారు.

ఈ వీడియోను మీరు కూడా చూడండి.ఈ వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు మీకూ ఎదురు కావొచ్చు కాబట్టి జాగ్రత్తగా వహించండి.

నేను భయపడటం జన్మలో జరగదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు వైరల్!