తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ లకు షాక్..!

తెలంగాణలో బీజేపీ ఇంచార్జ్ లకు షాక్ తగిలినట్లు తెలుస్తోంది.అసెంబ్లీ ఇంచార్జ్ లతో సునీల్ బన్సల్ సమావేశం జరిగింది.

అసెంబ్లీ ఇంచార్జ్ లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేదని బన్సల్ తెలిపారు.

దీంతో అసెంబ్లీ ఇంచార్జ్ లు ఒక్కసారిగా ఖంగుతిన్నట్లు తెలుస్తోంది.ఈ జాబితాలో మాజీ ఎమ్మెల్యేలు యెండల, యెన్నం శ్రీనివాస రెడ్డి, ధర్మారావు, స్వామిగౌడ్, విఠల్, బండా కార్తీకరెడ్డి ఉన్నారని సమాచారం.

అయితే బన్సల్ ప్రకటనతో తమను అసెంబ్లీ ఇంచార్జ్ లుగా తొలగించాలని పలువురు నేతలు కోరుతున్నారు.

ఈ క్రమంలో వారికి సర్దిచెప్పిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ కనీసం ఆరు నెలల పాటు ఇంచార్జ్ లుగా పని చేయాలని సూచించారు.

ఆరు నెలల తర్వాత సొంత నియోజకవర్గాల్లో పని చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారని తెలుస్తోంది.

ఇలాంటి తెలుగు సినిమా మీద ఈరకమైన చర్చె జరపరెందుకు?