ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్.. యూజర్ల డేటాను మెటా సంస్థ ట్రాక్ చేస్తోందా?

ప్రముఖ సోషల్ మీడియా సైట్స్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ఐఓఎస్ యాప్‌ల నుంచి యూజర్ల డేటాను మెటా సంస్థ ట్రాక్ చేస్తోందా? యూజర్ల ప్రతి కదలికలను ఇది గమనిస్తోందా? అని ప్రశ్నిస్తే అవుననే అంటున్నారు సైబర్ సెక్యూరిటీ నిపుణులు.

తాజాగా మాజీ గూగుల్ ఇంజనీర్, సైబర్‌ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ఫెలిక్స్‌ క్రాస్‌ మాట్లాడుతూ.

ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ఫేస్‌బుక్‌ యాప్‌ నుంచి యూఆర్‌ఎల్‌ లింక్స్‌పై క్లిక్ చేసినప్పుడు ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ అయిన మెటా యూజర్‌ డేటాను ట్రాక్‌ చేస్తున్నట్లు తమకు తెలిసిందని అన్నారు.

పాస్‌వర్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌లకు సంబంధించిన సున్నితమైన ఇన్ఫర్మేషన్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కలెక్ట్ చేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు.

సాధారణంగా ఐఓఎస్‌ వినియోగదారులు ఎక్కువగా సఫారీ బ్రౌజర్‌ని వాడుతుంటారు.అయితే వీరు ఏ యాప్‌లోనైనా యూఆర్‌ఎల్‌ లింక్‌పై నొక్కగానే.

అది సఫారీ బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది.కానీ ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ యాప్స్‌లో లింక్ పై క్లిక్ చేస్తే అది సఫారీ బ్రౌజర్‌లో కాకుండా.

ఆ యాప్స్‌ సొంత బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది.ఆ తర్వాత యూజర్లు ఆ సైట్ లో నొక్కే ఆప్షన్స్, లింక్స్‌, టెక్స్ట్ సెలక్షన్స్, స్క్రీన్‌షాట్‌లు, అలాగే పాస్‌వర్డ్‌లు, అడ్రస్‌లు, క్రెడిట్ కార్డ్ నంబర్‌ల వంటి ఏదైనా ఇన్‌పుట్‌లను ఆ సొంత బ్రౌజర్‌ కలెక్ట్ చేస్తుందని ఆయా సైబర్‌ సెక్యూరిటీ కంపెనీలు తెలిపాయి.

"""/"/ ఈ సొంత బ్రౌజర్‌లో మెటా పిక్సెల్‌ అనే కోడ్‌ ఉపయోగిస్తున్నారట.ఈ కోడ్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో యూజర్ల యాక్టివిటీని మెటా సంస్థ ట్రాక్‌ చేస్తోందని కొన్ని సెక్యూరిటీ కంపెనీలు ఆరోపణలు చేస్తున్నాయి.

వీటిపై ఇప్పటివరకు మెటా సంస్థ స్పందించలేదు.మరి ఈ ఆరోపణలపై మెటా ఎలా స్పందిస్తుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను ఫన్నీగా ఇమిటేట్ చేసిన స్కూల్‌గర్ల్.. వీడియో వైరల్..