నల్గొండ జిల్లా మునుగోడులో బీఆర్ఎస్ కు షాక్..!
TeluguStop.com
నల్గొండ జిల్లా మునుగోడులో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.ఈ మేరకు మున్సిపల్ ఛైర్మన్లు, ఎంపీపీలతో పాటు జెడ్పీటీసీలు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరారని తెలుస్తోంది.
చేరికల అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆత్మగౌరవం కోసం తెలంగాణ ఉద్యమం చేశామని పేర్కొన్నారు.
అయితే తెలంగాణ వచ్చాక కూడా ఆత్మగౌరవం కరువైందని కోమటిరెడ్డి చెప్పారు.ఒక కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందన్న ఆయన అందరం కలిసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని తెలిపారు.
ఆ కన్నడ హీరో నాతో మిస్ బిహేవ్ చేశాడు.. సంజన సంచలన వ్యాఖ్యలు వైరల్!